ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... దీప దేవుడితో ఇప్పుడు వరకు బతకడం కోసం వంటలు చేశాను, ఇప్పుడు నా ప్రేమను దక్కించుకోవడం కోసం చేయాల్సి వస్తుంది అని అనుకుంటుంది. అప్పుడు తనకి డాక్టర్ వాళ్ళ అమ్మగారు, "ఇదే మంచి సమయం అనుకొని మోనిత పిల్లల్ని కనడానికి ప్రయత్నం చేస్తుందేమో" అన్న మాటలు గుర్తొచ్చి మోనిత మనసులో ఇలాంటి ఆలోచనలు ఉన్నా ఉండొచ్చు దాన్ని ఎలాగైనా జరగకుండా ఆపాలి అని అనుకుంటుంది దీప.