తులసి దగ్గర లేదు అని తెలిసిపోయింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ అత్త ఇంటి దగ్గర ఉంటుంది అనుకున్న ప్రేమ్(pream)వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. మరొకవైపు శృతి వాళ్ళ అత్తయ్య శృతి తో మాట్లాడుతూ తెల్లారి సరికి నీ ప్రేమ్ వస్తాడు అన్నావు కదా ఏది ఇంకా రాలేదే అని అంటుంది. మాటల్లోనే ప్రేమ వస్తుంటాడు. అది చూసి శృతి(shruthi)ఎదురు వెళ్లి మాట్లాడించాలి అనుకోగా,అప్పుడు వాళ్ళ అత్తయ్య నువ్వు లోపలికి వెళ్లి కొద్దిసేపు నేను ప్రేమ్ ని ఆటాడిస్తాను అని అంటుంది.