Sadaa: కాటన్ చీరలో కత్తిలాంటి ఫోజులు... హీరోయిన్ సదా స్లీవ్ లెస్ సోకులకు కుర్రకారు ఫిదా!

Published : Jul 22, 2022, 12:58 PM IST

హీరోయిన్ గా సదా వెండితెరపై కనిపించి చాలా కాలం అవుతుంది. అయితే ఆమె సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. తన అభిమానుల కోసం అందాల విందు చేస్తున్నారు. వరుస ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తున్నారు.

PREV
17
Sadaa: కాటన్ చీరలో కత్తిలాంటి ఫోజులు... హీరోయిన్ సదా స్లీవ్ లెస్ సోకులకు కుర్రకారు ఫిదా!
Sadaa

తాజాగా సదా(Sadaa) కాటన్ చీర, స్లీవ్ లెస్ జాకెట్ ధరించి ఫోటో షూట్ చేశారు. సాంప్రదాయ గెటప్ లో కూడా సదా ఫోజులు మతిపోగొట్టేలా ఉన్నాయి. ఇక ఆమె కిల్లింగ్ స్మైల్ మరింత డామేజ్ చేసేలా ఉంది. నవ్వడానికి ఎప్పుడూ ఏదో ఒక కారణం ఉంటుంది... అంటూ తన ఫోటోలకు సదా కామెంట్ పెట్టారు. ఇక సదా లేటెస్ట్ ఫోటోస్ వైరల్ గా మారాయి.

27
Sadaa

ఇక సదా కెరీర్ పరిశీలిస్తే ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. హీరోయిన్ గా ఆమె దాదాపు రిటైర్ అయినట్లే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె బిజీ కావాలనుకుంటున్నారు. అలాగే డిజిటల్ కంటెంట్ లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు.

37
Sadaa


సదాకు ఇప్పటికీ టాలీవుడ్ లో గుర్తింపు ఉంది. కావున ఆమెకు మంచి ఆఫర్స్ రావడం ఖాయం. ఆమె కూడా కెరీర్ కి ఉపయోగపడే సినిమాలు చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. అందుకే ఆచితూచి ముందుకు వెళుతున్నారు. 

47
Sadaa

అప్పుడప్పుడు బుల్లితెర షోస్ లో సదా సందడి చేస్తున్నారు. ఈటీవి ప్రత్యేక కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటున్నారు. ఆ విధంగా తెలుగు ప్రేక్షకులకు ఆమె దగ్గర అవుతున్నారు. బుల్లితెరపై సదాను చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
 

57
Sadaa


కాగా 2002లో విడుదలైన జయం మూవీతో సదా కెరీర్ ప్రారంభమైంది. నితిన్ కూడా ఈ మూవీతోనే హీరోగా పరిచమయ్యాడు. దర్శకుడు తేజా తెరకెక్కించిన జయం మూవీ అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. జయం మూవీతో సదా ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. 
 

67
Sadaa

దీంతో ఎన్టీఆర్ వంటి స్టార్స్ పక్కన ఛాన్స్ దక్కించుకుంది. పొలిటికల్ థ్రిల్లర్ నాగ మూవీలో సదా ఎన్టీఆర్(NTR) కి జంటగా నటించారు. అయితే ఆ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు.

77
Sadaa

ఇక సదా కెరీర్ లో జయం తర్వాత అపరిచితుడు అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా ఉంది. విక్రమ్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన అపరిచితుడు తెలుగు, తమిళ భాషల్లో భారీ విజయం అందుకుంది. కెరీర్ నిర్మించుకోవడంలో ఫెయిల్ అయిన సదా త్వరగా ఫేడ్ అవుట్ అయ్యారు.

click me!

Recommended Stories