Samantha: రాంచరణ్ గురించి అంత మాట అనేసింది ఏంటి.. సమంత కామెంట్స్ వైరల్

Published : Jul 22, 2022, 12:31 PM IST

స్టార్ బ్యూటీ సమంత మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. సమంత రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొంది. ఈ షోలో సమంత చెప్పిన విషయాల గురించే ప్రస్తుతం చర్చ జోరుగా సాగుతోంది.

PREV
16
Samantha: రాంచరణ్ గురించి అంత మాట అనేసింది ఏంటి.. సమంత కామెంట్స్ వైరల్

స్టార్ బ్యూటీ సమంత మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. సమంత రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొంది. ఈ షోలో సమంత చెప్పిన విషయాల గురించే ప్రస్తుతం చర్చ జోరుగా సాగుతోంది. నాగ చైతన్యతో బ్రేకప్ తర్వాత సమంత తన సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. సామ్ ఎక్కడా చైతుతో విడిపోవడం గురించి మాట్లాడలేదు. 

26

కానీ ఈ షోలో నిర్మాత, హోస్ట్ గా వ్యవహరిస్తున్న కరణ్ జోహార్ సమంత పర్సనల్ విషయాలని కెలికే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో సామ్ కూడా చైతో బ్రేకప్ గురించి కొన్ని విషయాలు పంచుకుంది. బ్రేకప్ టైంలో తన మానసిక స్థితి ఎలా ఉంది.. ఆ తర్వాత తన పై జరిగిన ట్రోలింగ్ లాంటి విషయాల గురించి సామ్ మాట్లాడింది. 

36
19. రంగస్థలం - 43.8 Cr

ఇక కరణ్ జోహార్ సౌత్ హీరోల గురించి సామ్ ని ప్రశ్నించాడు. రాంచరణ్, అల్లు అర్జున్, ధనుష్, విజయ్ దేవరకొండ గురించి సమంత తనదైన శైలిలో వివరించింది. ఇక రాంచరణ్ గురించి సమంత చేసిన కామెంట్ వైరల్ అవుతోంది. రాంచరణ్ గురించి చెప్పాలంటే అతడు అసలైన గ్యాంగ్ స్టర్ అని సమంత తెలిపింది. సమంత, రాంచరణ్ కలిసి బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలంలో నటించారు.  

46

అల్లు అర్జున్ అంటే ఒక మ్యాజిక్ అని, ధనుష్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ అని పేర్కొంది. ఇక యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ.. అతడు మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ అని పేర్కొంది సామ్. ప్రస్తుతం సమంత, విజయ్ దేవరకొండ ఖుషి చిత్రంలో నటిస్తున్నారు. శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకుడు. 

56

ఈ షోలో సమంత నయనతార గురించి కూడా గుర్తు చేసుకుంది. వీరిద్దరూ కన్మణి రాంబో ఖతీజా చిత్రంలో నటించారు. ఆ మూవీ రిజల్ట్ పక్కన పెడితే.. సామ్, నయన్ మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. షూటింగ్ చివరి రోజున తాను, నయన్ ఒకరికొకరం హగ్ చేసుకుని ఏడ్చేసినట్లు పేర్కొంది. అంతలా తమ మధ్య స్నేహం బలపడినట్లు సామ్ తెలిపింది. 

66

ఈ షోలో సామ్ చైతో డివోర్స్ గురించి మాట్లాడుతూ.. తాను రూ 250 కోట్లు నాగ చైతన్య దగ్గర నుంచి భరణంగా తీసుకున్నట్లు వస్తున్న వార్తలు కేవలం రూమర్స్ మాత్రమే అని , అందులో నిజం లేదని సామ్ క్లారిటీ ఇచ్చింది. తాను ప్రస్తుతం డివోర్స్ బాధ నుంచి బయటపడి దృఢంగా మారినట్లు తెలిపింది. 

Read more Photos on
click me!

Recommended Stories