ఈరోజు ఎపిసోడ్ లో తులసి తన తల్లి ఇంటికి వెళ్లి అమ్మ అని ప్రేమగా పిలిచి వాళ్ళ అమ్మను హత్తుకుంటుంది. తులసి రావడంతో ఆమె తల్లి, దీపక్ ఇద్దురు సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు తిరిగినంత ప్రేమ్ చెప్పాడు అమ్మ అని అంటుంది. అప్పుడు తులసి జరిగిన విషయం గురించి తలుచుకొని బాధపడుతూ ఇక ఈ విషయం గురించి మనం మాట్లాడుకోకూడదమ్మా అని అంటుంది. అప్పుడు తులసి వాళ్ళ అమ్మ శభాష్.. నువ్వు మొదట ఆ కోడలిగా వెళ్ళావు. ఆ తర్వాత కూతురివి అయ్యావు. కానీ ఆ ఇల్లు కూతురు పరువును నిలబెట్టే లేక పోయింది అని అంటుంది.