ఈరోజు ఎపిసోడ్ లో వసుధార, రిషి ఇద్దరు కార్ లో వెళ్తూ ఆనందపడుతూ ఉంటారు. అప్పుడు రిషి వసుధార అన్న మాటలు తలుచుకుని ఆనందపడుతూ ఉంటాడు. అప్పుడు వసుధార ఇప్పుడు నా మనసు ఎంత సంతోషంగా ఉందో రిషి సార్ తో నా ప్రయాణం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రిషి, వసుధార నా మనసు ఎంతో సంతోషంగా ఉంది వసుధార. ఈ సమయంలో డాడ్ వాళ్ళు వస్తే బాగుంటుంది కదా అంటాడు రిషి. ఆ తర్వాత గులాబీ రెక్కను తీసుకొని రిషితన జేబులో పెట్టుకోగా ఎందుకు సార్ అని అనడంతో దాచుకుంటాను అందమైన జ్ఞాపకంగా అనటంతో వసుధార సంతోష పడుతూ ఉంటుంది.