ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..అభి, వాళ్ళ అత్తగారు ఇంటికి వస్తాడు. అప్పుడు అంకిత వాళ్ళ అమ్మ, అంకిత తేకుండా నిన్ను ఇక్కడికి రావద్దని చెప్పాను కదా! మళ్లీ ఎందుకు వచ్చావు అని అడుగుతుంది.దానికి అభి, అంకిత లేకపోతే నాకు ఇంట్లో విలువ ఉండదా?, నేను ఏంటి అల్లుడు కాదా అని అడగగా కాదు, నువ్వు లేకపోయినా అక్కడ అంకితకు విలువ ఉంతుంది కానీ అంకిత లేకపోతే ఇక్కడ నీకు విలువ ఉండదు. ఒకవేళ అంకిత రాను అంటే విడాకులు ఇచ్చేయు. అప్పుడు చచ్చినట్టు మా ఇంటికి వస్తుంది అని అంటుంది.