మిగిలిన వాళ్ళు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత సీన్లో ఇంట్లో కూర్చొని అందరూ అభిని తిడుతూ ఉంటారు. అసలు అమ్మ ఎదుగుతున్నప్పుడు అందరి మధ్య అమ్మ పరువు తీసావు, మన చేతులారా మనమే చేసుకున్నాము. నిన్ను లాస్య ఆంటీ వాళ్లు కీలుబొమ్మ లా వాడుకుంటున్నారు అని ప్రేమ్ చెప్తాడు. అప్పుడు అభి,ఏదో ఒక రోజు నీకు నిజం తెలుస్తుంది అప్పుడు మీరే నా దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతారు అని అంటాడు. అప్పుడు శృతి,నేను దీని గురించి సామ్రాట్ గారితో ముందే మాట్లాడాను. సామ్రాన్ గారికి ఆంటీని ఎదగడానికి సహాయం చేయడం తప్ప ఇంకేం ఉద్దేశం లేదు అని అంటుంది దానికి అభి, దొంగతనం చేసినట్టు దొంగతనం అంటే వాడు ఒప్పుకోడు కదా ఏదో ఒకరోజు బయటపడతాడు అప్పుడు చెప్తాను అని అంటాడు. అప్పుడు, ప్రేమ్ తిట్టి ఆ నంద గోపాల్ కోసం అమ్మని తలదించుకునేలా చేస్తున్నావా అని అనగా నాన్నని పేరు పెట్టి పిలుస్తున్నావ్ ఏంటి అని అభి అంటాడు.