ఇప్పుడు తులసి నందగోపాల్ గారు లాస్య గురించి పక్కన పెట్టండి కనీసం మీరైనా నేను చెప్పేది అర్థం చేసుకోండి అని అంటుంది. ఆల్రెడీ మా దగ్గరకు వచ్చాడు మేము ప్రాజెక్టు వద్దనే సరికి మీ దగ్గరికి వచ్చాడు అనగా చూసావా నందు తులసి తన ఫ్రెండు సామ్రాట్ తో పాటు నువ్వు కూడా ఎదగడం ఇష్టం లేక ఇలాంటి మాటలు చెబుతోంది అంటూ నందుకు లేనిపోని మాటలు చెప్పి రెచ్చగొడుతూ ఉంటుంది. నాకు ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు లేవు అని చెప్పేది విను నేను చెప్పేది నిజం అనడంతో లాస్య, నందు తులసి చెప్పే మాటలు నమ్మరు. బెనర్జీతో మీ కాంట్రాక్ట్ తప్పుడు నిర్ణయంతో అసలు నీతో పెళ్లి ఒక తప్పుడు నిర్ణయం అని అంటాడు నందు.