ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... సామ్రాట్ తులసి ఇంటికి వచ్చి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నా పరువు మీరే తీస్తున్నారు. ప్రేమ్ నువ్వు మొన్న ఒక మాట అన్నా గుర్తున్నాదా మీ అమ్మ ఎదుగుదలని ఎప్పుడు ప్రోత్సహించమని చెప్పావు ఇప్పుడు తను నా ఎదుగుదలని ఆపేస్తుంది. అయినా పేపర్లో ఈ న్యూస్ ఏంటి? బిజినెస్ పార్ట్నర్ షిప్ వద్దనుకున్నది. అలాగని పేపర్ లోని, న్యూస్ లోని అంతా చాటి నా పరువు తీయాలా అని అడగగా అక్కడున్న వాళ్ళందరూ పేపర్ చూస్తారు. అప్పుడు అంకిత, ఇది ఆంటీ చేసిన పని కాదు అని అంటుంది. లేకపోతే వాళ్ళు ఊరికినే ఇలా రాసి ఉంటారా, లేకపోతే ఎవరైనా కావాలని రాసి ఉంటారా అని సామ్రాట్ అనగా మీరు తెలుసన్నారో తెలీకన్నారో కానీ అదే నిజమై ఉంటుంది.