Intinti Gruhalakshmi: అందరి ముందు తులసిని దోషిగా చేసిన నందు, లాస్యలు! తులసిని తిట్టిన సామ్రాట్!

First Published Oct 3, 2022, 10:07 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు అక్టోబర్ 3వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే అనసూయ తులసిని చూసి,సామ్రాట్ ఇంకా తులసిని ఉద్యోగం  నుంచి వెళ్లిపోమని చెప్పు ఉండడు లేకపోతే తులసి ఇంత  ప్రశాంతంగా ఉండదు. సామ్రాట్ ఇంకా విషయం చెప్పలేదు అంటే నా మాటకి విలువ ఇవ్వలేనట్టే కదా అని అనుకుంటుంది. ఇంతలో అభి అక్కడికి వచ్చి, నానమ్మ నీకు చెప్పిన పని ఏమైంది ఏమైనా చేసావా అని అడుగుతాడు. అప్పుడు అనసూయ, నా ఏర్పాట్లలో నేనున్నాను. అయిన తర్వాత నీకే తెలుస్తుంది అని అంటుంది.నా దగ్గర కూడా ఎందుకు దాచడం నానమ్మ చెప్పు అని అనగా, చెప్తాను లేరా అయిన తర్వాత చెప్తాను అని అనసూయ అంటుంది. మనం ఏం చేసినా అమ్మ మంచి కోసమే కదా నానమ్మ అని అభి అంటాడు. అప్పుడు అనసూయ,ఏంటో రా మీ అమ్మ సగం జీవితం నా కొడుకుని నమ్మి మోసపోయింది.

మిగిలిన సగం జీవితం మనల్ని పోషించడానికి ఇలా గడిపేస్తుంది ఆఖరికి తులసికి ఇలాంటిది చేయాల్సిన రోజు వస్తుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు అని అనగా ఇంతలో తులసి అక్కడికి వస్తుంది.అంతా వినేసి ఉంటుందా అని అనసూయ భయపడుతుంది కానీ తులసి అక్కడికి వచ్చి దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని అడగగా, ఏమీ లేదు అమ్మ,నానమ్మ కాలు నొప్పి గురించి మాట్లాడుకుంటున్నాము అని అభి అంటాడు. ఆ తర్వాత సీన్లో సామ్రాట్ ఇంట్లో, అనసూయ తనతో చెప్పిన విషయం గురించి ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ బాబాయ్ అక్కడికి వచ్చి, ఏమైందిరా అలా ఆలోచిస్తున్నావు అయినా నిన్న తులసి ఫోన్ చేసినప్పుడు ఎత్తలేదు ఎందుకు తను చాలా బాధపడింది అని అంటాడు.


అప్పుడు సామ్రాట్, నిజంగానే నేను పనిలో ఉన్నాను బాబాయ్ ఎందుకు అలా ప్రతిసారి ఫోన్ చేసి ఎక్కడున్నారు అని అడగడం అని వాళ్ళ బాబాయ్ ని తిడతాడు. అప్పుడు వాళ్ళ బాబాయ్, నువ్వు కొత్తగా మాట్లాడుతున్నావు రా అని అంటాడు. ఆ తర్వాత సీన్లో ఝాన్సీ తులసికి ఫైల్స్ చదువిపిస్తూ సంతకాలు పెట్టిస్తూ ఉంటుంది. అంతలో లాస్య, నీకు ఆ పోస్ట్ ఇవ్వడమే ఎక్కువ మళ్ళీ పక్కన సహాయం కోసం ఇంకొకలు. ఇప్పుడు చూడు ఏమవుతుందో అని అంటుంది. అదే సమయంలో ఒక ఫైల్ ఝాన్సీ తులసికి ఇస్తుంది.అప్పుడు తులసి, ఇది సామ్రాట్ గారు చదివారా?ఆయన చూసిన తర్వాతే నా దగ్గరికి పంపించావా? అని అనగా అవును మేడం సామ్రాట్ గా చూసారు తర్వాత మీకు ఇచ్చారు ఏ ప్రాబ్లం లేదు సంతకం పెట్టొచ్చు అని అంటుంది. తులసి సంతకం పెడుతుంది. 

అప్పుడు సామ్రాట్ తులసిని చూస్తాడు అలా వెళ్ళిపోతాడు.సామ్రాట్ గారు ఎందుకిలా ఉన్నారు అని అనుకుంటుంది తులసి.ఆ తర్వాత సీన్ లో అనసూయ పుట్టినరోజుకి బట్టలు వెతుక్కుంటుంది. ఇంతలో అభి అక్కడికి వస్తాడు. ఏం చేస్తున్నావ్ నానమ్మ ఒకవైపు సామ్రాట్ గారిని అమ్మతో విడగొట్టాలి అనుకుంటున్నావు,మరోవైపు, పుట్టినరోజుకి వెళ్తున్నావు,అక్కడికి వెళ్లడం ఎందుకు అని అడగగా, నేను తులసి మంచి కోసమే ఏదైనా చేస్తాను. అలా అని పక్క వాళ్ళు ఏం చెప్పినా వింటాను అని అనుకోవద్దు. నాకు నచ్చింది నేను చేస్తున్నాను అయినా అంత మర్యాదగా పిలిచినప్పుడు వెళ్లడం మన గౌరవం. నువ్వు కూడా సాయంత్రం బయలుదేరు అని చెప్పుతాడు.

 ఆ తర్వాత సీన్లో ఆఫీస్ వాళ్ళు తులసిని, ముందున్న మేనేజర్ మమ్మల్ని బెదిరించే వాళ్ళు మేడం ఇప్పుడు మీరు అలా కాదు బాగా ఉన్నారు అని అనగా, అలా ఏమీ లేదులెండి ఇదంతా నా బాధ్యతను తులసి అంటుంది. ఇంతలో నందు అక్కడికి వచ్చి, బాధ్యత కాదు ఇదంతా మోసం ఆ ఫైల్ ఎవరు నిన్ను సంతకం పెట్టమన్నారు. నీవల్ల ఇప్పుడు సామ్రాట్ గారికి 10 కోట్లు లాస్ వచ్చే పని అయి ఉండేది. నేను సమయానికి చూసాను కానుక సరిపోయింది అని అంటాడు. ఇంతలో లాస్య, అవునా నందు అంత పని అయిందా!
 

అయినా ప్రతి ఒక్కరికి మేనేజర్ పోస్ట్లు ఇచ్చేస్తే ఇలాగే అవుతాది కంపెనీ గురించి కూడా ఆలోచించకుండా స్వార్థానికి సంతకాలు పెట్టేస్తారు అని అంటుంది. ఇంతలో సామ్రాట్ అక్కడికి వస్తాడు. అప్పుడు లాస్య జరిగిన విషయం అంటా చెప్పి, చూశారా సార్ మీరు నమ్మకంగా ఈ పోస్ట్ ఇస్తే తను ఇలా వృధా చేసింది అని అనగా తులసి, నాకు తెలియకుండా పొరపాటున చేశాను అని అంటుంది. మనసులో ఝాన్సీ గురించి తెలుసుకొని ఇప్పుడు తన గురించి చెప్తే తన ఉద్యోగం తీసేస్తారేమో అని భయపడుతుంది. అప్పుడు సామ్రాట్, తప్పు తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే.నందగోపాల్ గారు ఈ ప్రాజెక్ట్ఈడి  కాకపోయినా దీన్ని చూసి దీన్ని తీర్చిదిద్దినందుకు ధన్యవాదాలు అని అనగా, ఇది నా బాధ్యత సార్ ఎంతైనా మన కంపెనీ కదా డబ్బులు తీసుకుంటున్నందుకు న్యాయంగా ఉండాలి కదా ఇందాక తులసి గారి మీద కూడా అందుకే అరిచాను నన్ను క్షమించండి.

తప్పు చేసిన వారిని తీర్చిదిద్దారు అని సామ్రాట్ అంటాడు. అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్, తులసి నువ్వు సామ్రాట్ ఆఫీసులోకి రా.మన ముగ్గురం మాట్లాడదాము అని అనగా సామ్రాట్, తప్పు చేసినప్పుడు లోపలికి వెళ్లి మాట్లాడాల్సిన అవసరం లేదు బాబాయ్ అని అంటాడు సామ్రాట్.అప్పుడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత సామ్రాట్ తులసి తో,ఇప్పుడు జరిగినది ఏమీ మనసులో పెట్టుకోకుండా సాయంత్రం పుట్టినరోజు కి రండి.

మీరు లేకపోతే హనీ పుట్టినరోజు జరుపుకోదు అని చెప్పి వెళ్ళిపోతాడు.ఆ తర్వాత తులసి ఝాన్సీ దగ్గరికి వచ్చి, నిజం చెప్పు ఝాన్సీ నేను నిన్ను కనుక్కొని సంతకం చేశాను కదా! నీ పొట్ట కొట్టడం నాకు ఇష్టం లేక అక్కడ నీ పేరు చెప్పలేదు లేకపోతే అక్కడ ఏమి అయ్యేదో నీకు తెలుసు. ఇప్పుడు నిజం చెప్పు నువ్వు కావాలని చేశావా లేక ఎవరైనా నీ చేత చేయించారా అని అడుగుతుంది. పక్కనే లాస్య ఈ మాటలు చాటుగా వింటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తరువాయి భాగం లో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!