నయనతార వల్ల 50 కోట్లు నష్టపోయిన నెట్‌ఫ్లిక్స్‌ ? అసలు సంగతి ఏంటంటే?

Published : Apr 23, 2025, 03:14 PM ISTUpdated : Apr 23, 2025, 03:16 PM IST

నయనతార  ఈమధ్య వరుసగా వివాదాలు ఫేస్ చేస్తోంది. చాలా విషయాల్లో ఆమె అనేక విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది. ఈక్రమంలోనే నయనతర నటించిన ఓ సినిమా వల్ల నెట్‌ఫ్లిక్స్ సంస్థకు భారీగా నష్టం వచ్చిందట. ఇంతకీ ఆ సినిమా ఏది? నష్టానికి కారణం ఏంటి? 

PREV
14
నయనతార వల్ల 50 కోట్లు నష్టపోయిన  నెట్‌ఫ్లిక్స్‌ ? అసలు సంగతి ఏంటంటే?

 లేడీ సూపర్‌స్టార్ గా ఇమేజ్ తెచ్చుకుంది నయనతార, రీసెంట్ గా తనకు  ఆ బిరుదును వద్దు అని కూడా ప్రకటించింది. ఆమె ఆ బిరుదును వదులుకున్న తర్వాత విడుదలైన సినిమా టెస్ట్. ఈ సినిమాకి శశికాంత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నయనతారతో పాటు మాధవన్, సిద్ధార్థ్, మీరా జాస్మిన్ వంటి పెద్ద స్టార్స్ ఎందరో నటించారు.  ఈ సినిమా ఏప్రిల్ 4న నేరుగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా విడుదలైంది.

Also Read: సినిమాకు 200 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే ఖరీదైన విలన్ ఎవరో తెలుసా?

24
టెస్ట్ సినిమా

టెస్ట్ సినిమా విడుదలకు ముందు ఆ సినిమా గురించి బాగానే ప్రచారం చేసినా, ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ సినిమా థియేటర్లలో విడుదల కాకపోవడం మంచిదయ్యిందని అనేక రకాలుగా కామెంట్ చేసినవారు చాలా మంది ఉన్నారు.

నయనతార నటించిన నేత్రికన్, ఓ2, మూకుత్తి అమ్మన్, టెస్ట్ వంటి సినిమాలు ఇప్పటి వరకు ఓటీటీలో నేరుగా విడుదలయ్యాయి. వీటిలో మూకుత్తి అమ్మన్ సినిమా మాత్రమే విజయం సాధించింది. మిగతా సినిమాలు పరాజయం పాలయ్యాయి.

Also Read: ప్రభాస్ లాంటి కొడుకు కావాలంటున్న స్టార్ హీరోయిన్ ఎవరు?

 

34
టెస్ట్ సినిమా నష్టం

నటి నయనతార నటించిన టెస్ట్ సినిమా ద్వారా నెట్‌ఫ్లిక్స్ భారీ నష్టాన్ని చవిచూసిందని వలైపేచు బిస్మి అన్నారు. టెస్ట్ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయడానికి నెట్‌ఫ్లిక్స్ రూ.55 కోట్లు చెల్లించిందట. కానీ ఆ సినిమా ద్వారా నెట్‌ఫ్లిక్స్‌కు 5 కోట్లు కూడా లాభం రాలేదని చెబుతున్నారు. దీంతో 50 కోట్ల వరకు నష్టం వచ్చిందని బిస్మి తెలిపారు.

Also Read: సింగర్ సునీత కు ప్రవస్తి కౌంటర్, సైగలు చేసుకుని మరీ నాకు అన్యాయం చేశారు, వాళ్లు ఎలా టాప్ లో ఉన్నారు?

44
నయనతార

నయనతార నటించిన ఇటీవలి 10కి పైగా సినిమాలు వరుసగా పరాజయం పాలయ్యాయి. దీంతో నయన్ కంబ్యాక్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆమె నటించిన మూకుత్తి అమ్మన్ 2 సినిమా నిర్మాణంలో ఉంది. ఈ సినిమాను దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో సుందర్ సి. భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా నయనతార కంబ్యాక్ ఇస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమాను వేల్స్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది.

Also Read:  పహల్గాం ఉగ్రదాడి ప్రాంతంలో షూటింగ్స్ జరిగిన 9 సినిమాలు ఏవో తెలుసా?

Read more Photos on
click me!

Recommended Stories