Pooja Hegde: మాల్దీవ్‌ వెకేషన్‌ ముగిసింది.. వచ్చీ రాగానే అక్షయ్‌ కుమార్‌కి ఛాలెంజ్‌ విసిరిన పూజా

Published : Nov 26, 2021, 05:23 PM ISTUpdated : Nov 26, 2021, 05:26 PM IST

బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఇటీవల వెకేషన్‌లో తెగ ఎంజాయ్‌ చేసింది. హద్దుల్లేకుండా రెచ్చిపోయి హాలీడేస్‌ని ఆస్వాధించింది. ఇప్పుడు ఆ వెకేషన్‌ ముగించుకుని మొక్కలు నాటే కార్యక్రమంపై పడింది. అంతేకాదు అక్షయ్‌ కుమార్‌కి సవాల్‌ విసరడం విశేషం. 

PREV
18
Pooja Hegde: మాల్దీవ్‌ వెకేషన్‌ ముగిసింది.. వచ్చీ రాగానే అక్షయ్‌ కుమార్‌కి ఛాలెంజ్‌ విసిరిన పూజా

పూజా హెగ్డే (Pooja Hegde) మాల్దీవుల్లో వెకేషన్‌ పూర్తి చేసుకుని వచ్చింది. తాజాగా ఆమె శుక్రవారం గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొంది. టాలీవుడ్‌ హీరో సుశాంత్‌ విసిరిన ఛాలెంజ్‌ని స్వీకరించింది పూజా. అందులో భాగంగా ఆమె ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో మూడు మొక్కలను నాటింది. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది పూజా హెగ్డే. ఎంపీ సంతోకుమార్‌ ట్విట్టర్‌ ద్వారా పూజా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న ఫోటోలను పంచుకున్నారు. Pooja Hegde in green india challenge

28

పూజా హేగ్డే ఈ సందర్భంగా బాలీవుడ్‌స్టార్స్ ని నామినేట్‌ చేసింది. అక్షయ్‌ కుమార్‌, రితేష్‌ దేశ్‌ముఖ్‌లకు సవాల్‌ విసిరింది. వాళ్లు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనాలని, మూడు మొక్కలు నాటాలని పేర్కొంది. ఈ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ని గొలుసుని కొనసాగించాలని తెలిపింది పూజా. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌ కుమార్‌కి ధన్యవాదాలు తెలిపిందీ బుట్టబొమ్మ. 
 

38

ఈ సందర్భంగా పూజా హెగ్డే మాట్లాడుతూ.. `గ్రీన్ ఇండియా చాలెంజ్` కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉంది. ప్రకృతి, సమాజం పట్ల బాధ్యతతో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ `గ్రీన్ ఇండియా చాలెంజ్` గ్లోబల్ వార్మిగ్ ని అరికట్టడానికి దోహదపడుతుంది. భవిష్యత్ తరాల మనుగడకు అవకాశం కల్పిస్తుంది. అందుకే  ప్రతి ఒక్కరు బాధ్యతగా “గ్రీన్ ఇండియా చాలెంజ్”లో పాల్గొని మొక్కలు నాటాలని కోరుకుంటున్నాన` అని అన్నారు. 

48

పూజా హెగ్డే దాదాపు ఐదు రోజులపాటు మాల్దీవుల్లో గడిపింది. అక్కడ వెకేషన్‌ని ఎంజాయ్‌ చేసింది. బికినీ పూజా హోయలు, సముద్రంలో జలకాలాడుతూ పంచుకున్న పిక్స్, వీడియోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. ఫ్యాన్స్ కి మంచి ఫుల్‌ మీల్స్ పెట్టినట్టయ్యిందని చెప్పొచ్చు. 
 

58

బికినీలో, బీచ్‌ డ్రెస్సుల్లో పూజా హెగ్డే ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్‌ చేశాయని చెప్పొచ్చు. బ్యాక్‌ టూ బ్యాక్‌ డస్కీ భామ అందాల విస్పోటనం చేస్తుండటంతో ఫ్యాన్స్ వాటిని చూసి ఉక్కిరి బిక్కిరయ్యారని చెప్పొచ్చు. ఆమె వీడియోలు నెట్టింట తెగ హల్‌చల్‌ చేశాయని చెప్పొచ్చు. 

68
Pooja Hegde

Pooja Hegde

పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో `రాధేశ్యామ్‌` చిత్రంలో నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఇటీవల విడుదలైన `ఈ రాతలే` పాట సినిమాపై భారీ అంచనాలు పెంచింది. ప్రభాస్‌, పూజాల మధ్య లవ్‌ ప్రధానంగా సాగే మెలోడీ సాంగ్‌ ఆద్యంతం కట్టిపడేస్తుంది. మరోవైపు ఆమె `ఆచార్య` చిత్రంలో రామ్‌చరణ్‌తో జోడి కట్టింది. తమిళంలో విజయ్‌తో `బీస్ట్` సినిమాలో చేస్తుంది పూజా. 

78

వీటితోపాటు మహేష్‌బాబుతో `మహార్షి` తర్వాత మరోసారి జోడి కట్టబోతుంది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. దీంతోపాటు పవన్‌ కళ్యాణ్‌, హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమాలో, అలాగే అల్లు అర్జున్‌ `ఐకాన్‌` చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైందని సమాచారం. 
 

88

అలాగే బాలీవుడ్‌లోనూ ఓ సినిమా చేస్తుంది పూజా. రణ్‌వీర్‌ సింగ్‌, వరుణ్‌ శర్మ, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ కలిసి నటిస్తున్న `సర్కస్‌` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది పూజా. రోహిత్‌ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. వచ్చే ఏడాది జులై 15న విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. 

also read: Kartikeya: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో కార్తికేయ దంపతులు..

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories