అందాల భామ సమీరా రెడ్డి తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటుంది. తెలుగులో ఆమె కొన్ని సినిమాల్లో మాత్రమే నటించినప్పటికీ చిరంజీవి, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది.
తెలుగులో నరసింహుడు, అశోక్ లాంటి చిత్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జోడిగా నటించింది. సినిమాలు సక్సెస్ కాలేదు. కానీ ఎన్టీఆర్, సమీరా రెడ్డి గురించి అప్పట్లో చాలా గాసిప్స్ వచ్చాయి.
సమీరా రెడ్డి మెగాస్టార్ చిరంజీవి సరసన జై చిరంజీవా చిత్రంలో గ్లామర్ ఒలకబోసింది. సమీరా రెడ్డి వెండి తెరపై బాగానే అందాలు ఆరబోసింది. అందుకే యువతలో ఆమెకు మంచి క్రేజ్ ఉంది. హీరోలతో సమానంగా డాన్స్ చేయగల నటి సమీరా రెడ్డి.
ఇక సమీరా రెడ్డి వివాహం తర్వాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. సమీరా చివరగా తెలుగులో కృష్ణం వందే జగద్గురం చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది.
ముంబైకి చెందిన బిజినెస్ మ్యాన్ అక్షయ్ వర్దెని సమీరా రెడ్డి వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు సంతానం. గర్భంతో ఉన్న సమయంలో మహిళలు కాన్ఫిడెంట్ గా ఉండాలంటూ సమీరా రెడ్డి బికినిలో సాహసోపేతంగా అండర్ వాటర్ ఫోటోషూట్స్ తో హాట్ టాపిక్ గా నిలిచింది.
ప్రస్తుతం సమీరా రెడ్డి ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమీరా.. తన ఫ్యామిలీతో వెకేషన్ లో ఉన్న పిక్స్ షేర్ చేసింది. భర్త పిల్లలతో బీచ్ లో జాలీగా గడుపుతున్న ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.