ఇంత లేటా ఇప్పటికే దిగిపోవాల్సింది కదా... నాగబాబు నోటికి తాళం వేసింది ఎవరు? అన్నయ్యా, తమ్ముడా?

First Published Sep 28, 2021, 12:41 PM IST

మెగా ఫ్యామిలీ ఫైర్ బ్రాండ్ నాగబాబు(Naga babu) మౌనంగా ఉన్నారు. తమ్ముడు పవన్ కళ్యాణ్(Pawan kalyan) పై రాజకీయంగా, వ్యక్తిగతంగా దాడి జరుగుతున్నా మిన్న కున్నారు. కనీసం సోషల్ మీడియా ద్వారా కూడా ఆయన స్పందించలేదు. 
 

రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ ఆవేశం కట్టలు తెంచుకుంది. సినిమా పెద్దల నుండి వైసీపీ మంత్రుల వరకు ఎవరినీ వదల్లేదు. చివరికి అన్నయ్య చిరంజీవికి కూడా పవన్ చురకలు అంటించారు. వైసీపీ మంత్రులనైతే సన్నాసులు, వెధవలు అంటూ తిట్టేశారు.
 

ఓ సినిమా వేదిక సాక్షిగా పవన్ చేసిన రాజకీయ ప్రసంగం సర్వత్రా చర్చకు తెరలేపింది. ఆయన వాదనకు ప్రతివాదనలు, సవాళ్లకు ప్రతి సవాళ్లు విసిరారు వైసీపీ వర్గాలు. మంత్రి పేర్ని నాని రెండు చోట్ల ఓడిపోయిన నీవు సన్నాసిన్నర అంటూ సెటైర్స్ వేశారు.

ఇక  పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది. ప్రత్యక్షంగా పవన్ పై పలు ఆరోపణలు చేసిన పోసాని, అవకాశాల పేరుతో పంజాబీ అమ్మాయిని లొంగదీసుకుని గర్భవతిని చేసి మోసం చేసిన వ్యక్తిని, పవన్ పట్టుకోవాలని, ప్రశ్నించాలని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.  హీరోయిన్ పూనమ్ కౌర్ జీవితంతో ఆడుకున్న నీవా... స్త్రీల రక్షణ, భద్రత గురించి మాట్లాడేదని పోసాని ఇండైరెక్ట్ గా పవన్ ని ప్రశ్నించాడు. 

ఈ స్థాయిలో పవన్ పై దాడి జరుగుతుంటే నాగబాబు మౌనంగా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చిన్న చిన్న విషయాలకు కూడా వెంటనే స్పందించే నాగబాబు, ఇంత పెద్ద గొడవలో జోక్యం చేసుకోకపోవడం వెనుక కారణం ఏమిటో అర్థం కావడం లేదు. 
 

మెగా ఫ్యామిలీని ఎవరు నిందించినా ముందుగా మాట్లాడేది నాగబాబే. చిరంజీవితో పాటు మెగా హీరోలు ఎవరూ, ఏ వివాదంపై ప్రత్యక్షంగా మాట్లాడరు. నాగబాబు మెగా ఫ్యామిలీ స్పోక్స్ పర్సన్ వలె, వీడియోలు, సోషల్ మీడియా కామెంట్స్ రూపంలో కౌంటర్లు ఇస్తూ ఉంటారు. 
 


ప్రస్తుత వివాదంపై నాగబాబు స్పందించాలని అనుకోవడం లేదా, ఈ విషయంలో కలుగ చేసుకోవద్దని, పవన్ కళ్యాణ్, లేదా చిరంజీవి సూచించారా, అనే అనుమానాలు కలుగుతున్నాయి. 

అదే సమయంలో పవన్ ప్రత్యర్థుల సవాళ్లకు సమాధానాలు, వాళ్లకు ఈయన తరపు ప్రశ్నలు సిద్ధం చేస్తూ యుద్దానికి సిద్ధం అవుతున్నారా, అనే మరో సందేశం కలుగుతుంది. 

ఏది ఏమైనా నాగబాబు ఈ విషయంలో కలుగజేసుకోవాలని, జనసేన కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఓ మీడియా సంస్థ ట్విట్టర్ వేదికగా నాగబాబు రంగంలోకి దిగాలని వైసీపీ వర్గాలపై దాడి చేయాలని సలహా ఇవ్వడం కొసమెరుపు. 

click me!