పవన్ తో ఏకీభవించను.. ఆయన ఓటు మాత్రం నాకే, చిరు కూడా.. నామినేషన్ తర్వాత విష్ణు హాట్ కామెంట్స్

First Published Sep 28, 2021, 2:22 PM IST

'మా' ఎన్నికలు రసవత్తరంగా మారాయి. నామినేషన్స్ ప్రక్రియ జోరందుకుంది. నిన్న బండ్ల గణేష్ నామినేషన్ వేయగా.. నేను మంచు విష్ణు ప్యానల్ మొత్తం నామినేషన్స్ వేశారు. విష్ణు భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయడం విశేషం.

manchu vishnu

'మా' ఎన్నికలు రసవత్తరంగా మారాయి. నామినేషన్స్ ప్రక్రియ జోరందుకుంది. నిన్న బండ్ల గణేష్ నామినేషన్ వేయగా.. నేను మంచు విష్ణు ప్యానల్ మొత్తం నామినేషన్స్ వేశారు. విష్ణు భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయడం విశేషం. ఈసారి మా ఎన్నికల్లో విష్ణు, ప్రకాష్ రాజ్ లని ప్రధాన పోటీ దారులుగా భావిస్తున్న సంగతి తెలిసిందే. 

నామినేషన్స్ అనంతరం విష్ణు మీడియా ముందు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది తెలుగు సినిమా ఆత్మగౌరవానికి సంబంధించిన ఎలక్షన్ అని పేర్కొన్నారు. నేను, నా ప్యానల్ సభ్యులం అంతా నామినేషన్ వేశాం. గెలుపు తమదే అని విష్ణు ధీమా వ్యక్తం చేశాడు. 

చిరంజీవి  మద్దతు గురించి మాట్లాడుతూ.. నా మేనిఫెస్టో చూశాక చిరంజీవి గారు నాకే ఓటు వేస్తారు. పవన్ కళ్యాణ్ గారి ఓటు కూడా నాకే అంటూ విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనితో సహజంగానే మీడియా పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ ని లేవనెత్తింది. దీనికి విష్ణు బదులిస్తూ తాను పవన్ గారి స్పీచ్ ని పూర్తిగా చూడలేదని కానీ సారాంశం తెలుసు అని అన్నారు. 

టాలీవుడ్ నిర్మాతల కోరిక మేరకే ఎపి ప్రభుత్వం ఆన్లైన్ టికెట్స్ తీసుకువస్తోందా అని ప్రశ్నించగా.. సాక్షాత్తూ దీని గురించి మంత్రి పేర్ని నాని గారే చెప్పారు. మినిష్టర్ చెప్పాక అబద్దం ఎలా అవుతుంది. అదే నిజం అని విష్ణు తెలిపాడు. పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలతో నేను ఏకీభవించను. దీనిపై తెలుగు ఫిలిం ఛాంబర్ స్వయంగా లేఖ విడుదల చేసింది. పవన్ వ్యాఖ్యలతో ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చేసింది. సో నేను కూడా ఇండస్ట్రీ తరపునే నిలబడతాను అని విష్ణు అన్నాడు. 

manchu vishnu

ఈ విషయంలో ప్రకాష్ రాజ్ గారి స్టాండ్ ఏంటి.. ఆయన ఇండస్ట్రీ తరుపున నిలబడతారా లేక పవన్ కళ్యాణ్ తరుపున నిలబడతాడా ఆయన్నే అడగండి అని విష్ణు కామెంట్స్ చేశాడు. 

ఇక పవన్ కళ్యాణ్ గారు నాన్నగారిపై కూడా వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు నాన్నగారే స్వయంగా ఎలక్షన్ అయిపోయాక ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తారు. కళ్యాణ్ గారు నన్ను ప్రశ్నించలేదు కాబట్టి నేనేమి మాట్లాడను అని విష్ణు తెలిపాడు.  

click me!