ఆనంద్(అస్గర్ అలీ) అనే పోలీస్ అధికారి కర్ణాటక, కేరళ సరిహద్దుల్లోని ఫారెస్ట్ ప్రాంతానికి బదిలీ అవుతాడు. విధుల్లో చేరడానికి వెళుతున్న క్రమంలో ఆనంద్ ఒక యాక్సిడెంట్ చేస్తారు. ఆ వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత అడవిలో కొందరు యువకులు గొడవపడుతున్నారని తెలుస్తుంది. మరో పోలీస్ అధికారి అశోకన్ తో కలసి ఆనంద్ అడవిలోకి వెళతారు. అక్కడ ఊహించని విధంగా వీరికి ఒక శవం కనిపిస్తుంది. అంతలోనే తనని రక్షించమని, గాయపడ్డానని స్టీఫెన్ అనే పోలీస్ అధికారి వాకీటాకీలో ఆనంద్, అశోకన్ లకు తెలియజేస్తాడు.