Toxic Preview Talk: టాక్సిక్ ప్రివ్యూ టాక్‌.. వాళ్లకు మాత్రం అదిరిపోయే ట్రీట్‌.. అసలు టార్గెట్‌ ఇదే

Published : Apr 17, 2026, 05:50 PM IST

Toxic Preview Talk: యష్‌ హీరోగా ప్రస్తుతం `టాక్సిక్‌` మూవీ రూపొందుతుంది. ఇది జూన్‌లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. అయితే తాజాగా ప్రివ్యూ ప్రదర్శించారు. దీనికి సంబంధించిన టాక్‌ బయటకు వచ్చింది. ఒక్క విషయం మాత్రం లీక్‌ అయ్యింది.  

PREV
15
సినిమాకాన్‌లో 'టాక్సిక్' ప్రివ్యూ

యష్‌ హీరోగా `టాక్సిక్‌` చిత్రం రూపొందుతుంది. గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఇది. అంతర్జాతీయ స్థాయిలో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని అంతర్జాతీయంగా మార్కెట్‌ చేసేందుకు టీమ్‌ భారీ స్కెచ్‌ వేసింది. సినిమాకాన్‌లో ప్రదర్శించారు. 9 నిమిషాల సినిమా ఫూటేజీని ప్రదర్శించారు. ఈ స్పెషల్‌ సీక్రెట్‌ ప్రివ్యూ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అందరిని ఆకట్టుకుంటోంది. ఇంటర్నేషనల్‌ స్టేజ్‌పై 'టాక్సిక్' చిత్ర బృందం వేసిన మాస్టర్ ప్లాన్ ఇది. కేవలం సినీ ప్రముఖులు, పంపిణీదారుల కోసం ప్రదర్శించిన ఈ ప్రివ్యూ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. 

25
టాక్సిక్‌ వారికోసం అద్భుతమైన స్టోరీ

టాక్సిక్‌ మూవీ ప్రివ్యూ రిజల్ట్ లీక్‌ అయ్యింది. దీన్ని పెద్దల కోసం రూపొందించిన ఒక అద్భుతమైన స్టోరీ అని అంతా అభివర్ణించారు. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.  యష్‌ మాస్ లుక్‌తోపాటు ఈ కొత్త థీమ్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తోంది.

35
హాలీవుడ్ స్థాయిలో మేకింగ్

'టాక్సిక్' ప్రివ్యూ చూసిన వారి ప్రకారం, సినిమా మేకింగ్ క్వాలిటీ అద్భుతంగా ఉంది. పాత కాలాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడంలో దర్శకురాలు సక్సెస్ అయ్యారని టాక్. ఈ మూవీ 1940-70  టైమ్‌ పీరియడ్‌లో సాగుతుందట. మేకింగ్‌ హాలీవుడ్‌ స్థాయిలో ఉందట. విజువల్స్ గూస్‌ బంమ్స్ అంటున్నారు. 

45
'టాక్సిక్'లో మెరిసే హీరోయిన్లు వీరే

ఈ సినిమాలో యష్‌తో పాటు సౌత్, నార్త్ ఇండస్ట్రీల నుంచి పెద్ద తారలు నటిస్తున్నారు.  నయనతార, కియారా అద్వానీ వంటి స్టార్‌ హీరోయిన్లు నటిస్తున్నారు. భారీ కాస్టింగ్‌తో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో యష్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆయన పాత్రలోని వేరియేషన్స్ సర్‌ ప్రైజ్‌ చేస్తాయని టాక్‌.

55
'టాక్సిక్' ప్రివ్యూలో హైలైట్స్

9 నిమిషాల ప్రివ్యూలో యష్‌ కొత్త మాస్ లుక్, రవి బస్రూర్ అందించిన పవర్ఫుల్ నేపథ్య సంగీతం ప్రేక్షకులను కట్టిపడేశాయని సమాచారం. ఈ కాంబో థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయం అంటున్నారు. మొత్తంగా ప్రివ్యూతోనే మూవీపై అంచనాలను పెంచేశారని చెప్పొచ్చు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories