Samantha Item Song:మగవాళ్ల పాడు బుద్ది బయటపెట్టావ్ భేష్... సమంతకు అమరావతిలో పాలాభిషేకం!

First Published | Dec 16, 2021, 9:55 AM IST

సమంత (Samantha)జీవితంలో ఈ మధ్య వివాదాలు కామనైపోయాయి. ఆమె ఏం చేసినా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. విడాకుల రచ్చ ముగిసింది అనుకునే లోపే.. ఐటెం సాంగ్ వివాదం తెరపైకి వచ్చింది. పుష్ప మూవీలో సమంత చేసిన ఐటమ్ నంబర్ వివాదాస్పదమైంది. 

అల్లు అర్జున్ (Allu Arjun)-సుకుమార్ ల పాన్ ఇండియా మూవీ పుష్ప లో సమంత 'ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మావా' (Oo antava oo oo antava)అనే ఐటెం సాంగ్ చేశారు. కెరీర్ లో మొదటిసారి ఐటెం సాంగ్ చేసిన సమంత బోల్డ్ స్టెప్స్ తో రచ్చ చేశారు. రచయిత చంద్రబోస్ రాసిన లిరిక్స్  డబుల్ మీనింగ్స్ తో కొంచెం పచ్చిగా ఉన్నాయి.అలాగే స్కిన్ షోలో హద్దులు దాటిన సమంత తీరు మైండ్ బ్లాక్ చేస్తుంది.

Samantha


సమంత ఐటెం సాంగ్ కి సొసైటీ నుండి మిశ్రమ స్పందన లభిస్తుంది. మగవాళ్ళు ఆమెను తిడుతుంటే, ఆడవాళ్లు పొగుడుతున్నారు. మగవాళ్ల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పాటలో లిరిక్స్ ఉన్నాయని పుష్ప ఐటెం సాంగ్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే.  మగజాతిని కామాంధులుగా సాంగ్ లో చిత్రీకరించారనేది వారి ఆరోపణ. ఊ అంటావా మావా సాంగ్ లోని లిరిక్స్ మార్చాలని ఓ వర్గం తీవ్రంగా తప్పుబడుతున్నారు. 


మరోవైపు సమంత ఈ సాంగ్ కారణంగా ప్రసంశలు అందుకుంటున్నారు. సమంత పట్ల ఆడవాళ్ళ ఆలోచన మరోలా ఉంది. మగాళ్ల వక్ర దృష్టిని ఈ పాట ద్వారా బయటపెట్టారని మహిళలు సమంతను అభినందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతిలో సమంతకు, లిరిసిస్ట్ చంద్రబోస్ చిత్రపటాలకు పాలాభిషేకం కూడా చేశారు. అలాగే పుష్ప మూవీని మొదటిరోజు థియేటర్స్ లో చూస్తామని చిత్ర యూనిట్ కి హామీ ఇచ్చారు. 
 

సమాజంలో స్త్రీల పట్ల మగవారి చెడు దృష్టిని చక్కగా వర్ణించి, ఓ సామాజిక సమస్య తెరపైకి తెచ్చారనేది సదరు మహిళల అభిప్రాయం. ఏదో ఐటెం నంబర్ కోసం రాసిన ఈ సాంగ్ ఇంత వివాదమవుతుందని రాసిన చంద్రబోస్ తో పాటు నటించిన సమంత కూడా ఊహించి ఉండరు.


అయితే ఈ ఐటెం సాంగ్ వివాదం కారణంగా పుష్ప మూవీకి ఫ్రీ పబ్లిసిటీ దక్కుతుంది. సాంగ్ కారణంగా పుష్ప గురించి కొన్ని వర్గాలు ప్రముఖంగా మాట్లాడుకునేలా అయ్యింది. 

లక్కీ లేడీగా పేరున్న సమంత తన అదృష్టం రుచి పుష్ప సినిమాకు చూపించింది. ఆమె ద్వారా ఈ మూవీకి ఫ్రీ పబ్లిసిటీ దక్కింది. ఐటెం సాంగ్ వివాదం తర్వాత... బన్నీ కంటే కూడా సమంత పేరునే ప్రముఖంగా వినిపించడం విశేషం. 

పుష్ప రేపు వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల కానుంది. దర్శకుడు సుకుమార్ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కించారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. అల్లు అర్జున్ పుష్ప మూవీతో బాలీవుడ్ లో అడుగుపెడుతుండగా.. అక్కడ ఈ స్థాయి విజయం సాధిస్తాడమే ఆసక్తి కొనసాగుతుంది. పుష్ప చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. 

Also read Samantha Item Song: మహేష్ చేస్తే తప్పు.. నువ్వు చేస్తే ఒప్పా సమంత?

Also read Pushpa: దిల్ రాజు పెద్ద రిస్క్ తీసుకున్నాడా?

Latest Videos

click me!