Ntr with Samantha: అందరి ఆలోచనలను తలక్రిందులు చేస్తున్న సమంత.. చైతూకి మైండ్‌బ్లాంక్‌ ?

Published : Dec 26, 2021, 07:49 PM ISTUpdated : Dec 27, 2021, 08:12 AM IST

సమంత.. ఇప్పుడు ఒక సంచలనం. ఆమె కెరీర్‌ పరంగా ముందుకు సాగుతున్న విధానం చూస్తుంటే  విడాకుల ప్రకటన తర్వాతనే తనకు అసలైన స్వేచ్ఛ వచ్చిందా? అనేట్టుగా ఉంది. ఎన్టీఆర్‌తో మరోసారి సమంత జోడీ కట్టడం మరింత ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది.   

PREV
18
Ntr with Samantha: అందరి ఆలోచనలను తలక్రిందులు చేస్తున్న సమంత.. చైతూకి మైండ్‌బ్లాంక్‌ ?

నాగచైతన్య(Naga Chaitanya)తో విడాకులకు ముందు సమంత(Samantha) స్టార్‌ హీరోయిన్‌. ఇతర స్టార్‌ హీరోయిన్లలో ఒకరు. నటిగా తనకంటూ ఓ గుర్తింపుని, ఇమేజ్‌ని సొంతం చేసుకున్న కథానాయిక. కానీ ఇప్పుడు సమంత మారిపోయింది. ఆమె రేంజే మారిపోయింది. అనేక విషయాలను తలక్రిందులు చేస్తూ Samantha ఓ సునామీలా అవతరించింది. తనో సెన్సేషన్‌ అవుతుంది. 

28

సమంత చైతూతో విడాకుల ప్రకటన తర్వాత స్వేచ్ఛ దొరికిందా అనేట్టుగా ఉంది ఇప్పుడు ఆమె కెరీర్‌ పరంగా వేస్తున్న అడుగులు చేస్తుంటే. ఓ బిగ్‌ ఫ్యామిలీ నుంచి దూరం కావడంతో ఇక సమంత పని అయిపోయినట్టే, ఇండస్ట్రీని ఎంకరేజ్‌ చేయడం కష్టం, అవకాశాల కోసం కష్టపడాల్సిందే అనే  కామెంట్లు వినిపించాయి. కెరీర్‌ పరంగా స్ట్రగులింగ్‌ ఎదుర్కొవల్సిందే అంటూ నెట్టింట్ల వార్తలు వైరల్‌ అయ్యాయి. కానీ అనేక మంది ఆలోచనలు, ఊహలను తలక్రిందులు చేసింది సమంత. ఒక సంచలనాత్మకంగా దూసుకుపోతుంది. 

38

సమంత ప్రస్తుతం వరుసగా సినిమాలకు కమిట్‌ అవుతున్న విధానం, ఆమెకి వస్తోన్న అవకాశాలను చూస్తుంటే సమంత ఎంతటి వేగంగా దూసుకుపోతుందో అర్థమవుతుంది. చైతూ, సమంత విడిపోతున్నట్టు ప్రకటించింది అక్టోబర్‌ 2. కానీ పదిహేను రోజుల గ్యాప్‌తో ఆమె రెండు బైలింగ్వల్‌ లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలను దసరాకి అనౌన్స్ చేసింది. ఆ తర్వాత ఓ ఇంటర్నేషనల్‌ ప్రాజెక్ట్ ని ప్రకటించి అందరిని షాక్‌కి గురి చేసింది. 
 

48

మరోవైపు `ది ఫ్యామిలీ మ్యాన్‌` వెబ్‌సిరీస్‌తో నార్త్ లోనూ మంచి గుర్తింపుని తెచ్చుకుంది. దీంతో సమంతకి బాలీవుడ్‌ ఆఫర్స్ వస్తున్నాయని టాక్‌. ఇటీవల సమంత.. గ్రీకువీరుడు హృతిక్‌ రోషన్‌ని కలిసింది. వీరిద్దరు కలిసి బాలీవుడ్‌లో సినిమా చేయబోతున్నట్టు వార్తలు ఊపందుకున్నాయి. ఓ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలోనే అనౌన్స్ మెంట్‌ ఉంటుందని టాక్‌. 
 

58

ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలుగులో మరో భారీ ప్రాజెక్ట్ కి సమంత కమిట్‌ అయ్యిందని టాక్‌. యంగ్‌ టైగర్‌, `ఆర్‌ఆర్‌ఆర్‌` స్టార్‌ ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయబోతుందట సమంత. సమంత ఇప్పటికే ఎన్టీఆర్‌(Ntr)తో `బృందావనం`, `రామయ్య వస్తావయ్యా`, `రభస`, `జనతాగ్యారేజ్‌` చిత్రాల్లో నటించింది. ఎన్టీఆర్‌, సమంత బెస్ట్ జోడీగా టాలీవుడ్‌లో పేరుంది. ఇప్పుడు ఐదోసారి కలిసి నటించబోతున్నట్టు ఫిల్మ్ నగర్‌టాక్‌. 

68

Ntr ప్రస్తుతం `ఆర్‌ఆర్‌ఆర్‌` నటించగా, ఇది జనవరి 7న విడుదల కానుంది. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తన `ఎన్టీఆర్30` సినిమా పట్టాలెక్కనుంది. ఆ చిత్రంలో సమంతని హీరోయిన్ గా తీసుకోవాలని టీం యూనిట్ భావిస్తున్నట్టుగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. కానీ అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు సమంతను హీరోయిన్ గా తీసుకోవాలని అసలు డైరెక్టర్ ఇంతవరకు అనుకోలేదట. ఎన్టీఆర్ 30 కోసం పరిశీలిస్తున్న హీరోయిన్ల జాబితాలో కూడా సమంత పేరును ఇప్పటివరకు అనుకోలేదని సమాచారం. 

78

ఇలా వరుసగా నాలుగైదు భారీ సినిమాలతో కెరీర్‌ని పరుగులు పెట్టిస్తుంది సమంత. ఇది చూసి నాగచైతన్యకి, ఆయన ఫ్యామిలీకి మైండ్‌ బ్లాంక్‌ అవుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. అంతేకాదు ఇటీవల `పుష్ప` చిత్రంలో ఐటెమ్ సాంగ్‌ చేసి అందరికి షాక్‌ ఇచ్చింది సమంత. ఈ విషయంలోనూ చైతూ కాస్త గుర్రుగా ఉన్నట్టు టాక్‌. ఓ సందర్భంలో ఆయన దీనిపై నెగటివ్‌ కామెంట్లు చేసినట్టు ఆ మధ్య ఓ వార్త చక్కర్లు కొట్టింది.

88

ఏదేమైనా సమంత ఇప్పుడే స్వేచ్ఛగా సినిమాలు చేస్తుందని, గ్లామర్‌ షో పరంగానూ ఎలాంటి లిమిటేషన్స్ లేకుండా తనకు నచ్చినట్టు ఉంటుందని ఆమె ఇంటర్నెట్‌ అభిమానులు ప్రశంసలు కురిపించడం విశేషం. ప్రస్తుతం సమంత నటించిన `శాకుంతలం`, `కాతు వాకుల రెండు కాదల్‌` చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

also read: క్రిస్మస్‌ వేడుకలో హాట్‌ బ్యూటీ పూజా హెగ్డే .. సిగ్గులొలికిస్తూ కట్టిపడేస్తున్న ప్రభాస్‌ హీరోయిన్‌

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories