Ram Gopal Varma: షాకింగ్ నక్సలైట్ గా మారిన డైరెక్టర్ వర్మ ... ప్రత్యర్థుల గుండెల్లో హడల్!

Published : Dec 26, 2021, 06:06 PM IST

దర్శకుడు వర్మ (Ram Gopal Varma)నక్సలైట్ గా మారిపోయారు. బందూక్ చేతపట్టి విప్లవ గళం అందుకున్నారు. పెత్తందార్ల దక్కర గులాంగిరీ చేసేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.   

PREV
18
Ram Gopal Varma: షాకింగ్ నక్సలైట్ గా మారిన డైరెక్టర్ వర్మ ... ప్రత్యర్థుల గుండెల్లో హడల్!


ఎవరినీ లెక్క చేయని, భగవంతుడ్ని కూడా నమ్మని వర్మ నక్సలైట్ గా ఎవరిపై తిరగబడనున్నాడో అనే ఆందోళనలు మొదలయ్యాయి. సినిమాలో పస లేకుండా పబ్లిసిటీతో పీక్స్ కి తీసుకెళ్లడం వర్మకు తెలిసిన మాత్రమే విద్య. 
 

28


ఒకప్పటి ఇండియాస్ నంబర్ డైరెక్టర్ గా వర్మకు బ్రాండ్ నేమ్ ఉంది. అయితే ఇప్పుడు ఆ స్థాయి చిత్రాలు ఆయన వద్ద నుండి రావడం లేదు. బుర్రకు పెద్దగా పని చెప్పకుండా కాంట్రవర్సీ సబ్జక్ట్స్ తో సినిమాలు తెరెక్కిస్తున్నారు. 

38


ఈ మధ్య కాలంలో వర్మ నుండి వచ్చి ఒక్క మూవీ కూడా ప్రేక్షకులకు నచ్చలేదు. అయినప్పటికీ ఆయన కొత్త చిత్రానికి ఎంతో కొంత మార్కెట్ ఉంటుంది. అతి తక్కువ బడ్జెట్ తో తీస్తాడు కాబట్టి, వచ్చే ఓ కొద్దోగొప్పో వసూళ్లే లాభాలు తెచ్చిపెడతాయి. 

48

తన సినిమాలకు ప్రచారం ఎలా కల్పించుకోవాలో వర్మకు బాగా తెలుసు. అది కూడా రూపాయి ఖర్చు కాకుండా. ఫ్యాన్స్ కలిగి ఉన్న వ్యక్తులను గెలకడం ద్వారా వాళ్లలో కోపం రగిలించి, ఈ మూవీ గురించి మాట్లాడుకునేలా చేస్తాడు. ఈ క్రమంలో వర్మను సదరు ఫ్యాన్స్ తిట్టినా అతనికి ఓకే. అలా మరింత పబ్లిసిటీ తెచ్చుకుంటాడు.

58


వర్మ ఓ కాంట్రవర్సీ మూవీ ప్రకటించగానే మీడియా సంస్థలు స్టూడియోల్లో కూర్చోబెట్టి డిబేట్లు పెడతాయి. ఇది ఒకరకమైన పబ్లిసిటీ. తాజాగా వర్మ మరో కాంట్రవర్సీల్ సబ్జెక్టు ఎంచుకున్నారు. తెలంగాణా రాజకీయ ఫ్యామిలీలో ఒకటిగా ఉన్న కొండా సురేఖ, సురేష్ దంపతుల జీవిత చరిత్రను కొండా (Konda)పేరుతో తెరకెక్కించారు. 

68


ఈ సినిమా తీయడానికి వీలు లేదంటూ కొండా దంపతుల ప్రత్యర్ధులు వర్మకు వార్నింగ్స్ ఇచ్చారట. ఇలాంటి వార్నింగ్స్ చాలా చూసేసిన వర్మ, మీకు చేతనైంది చేసుకోండి సినిమా ఆపేది లేదని చెప్పేశాడు. 
 

78

కొండా మురళి పాత్రలో అదిత్ అరుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ కనిపించనున్నారు. కంపెనీ ప్రొడక్షన్ నిర్మిస్తోంది. చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా వ‌రంగ‌ల్‌లో షూటింగ్ ముగింపు వేడుక జరిగింది. దీనికి కొండా మురళి, సురేఖ దంపతులు హాజరయ్యారు. 

88


ఈ పార్టీకి రామ్ గోపాల్ వర్మ నక్సలైట్ గెట‌ప్‌లో వచ్చారు. అంతే కాదు... 'కొండా', 'బలుపెక్కిన ధనికుడా... కాల్ మొక్కుడు లేదిక' పాటలకు ఆయన పెర్ఫార్మన్స్ చేశారు. హీరో అదిత్ అరుణ్, ఇతర నటీనటులతో కలిసి స్టెప్పులు వేశారు.  

Also read హిట్లర్ లేకపోతే రెండో ప్రపంచ యుద్దానికి, గాంధీజీ లేకపోతే భారత స్వాతంత్ర్య పోరాటానికి అర్థమే లేదు

Also read Nani:“వకీల్ సాబ్” టైంలోనే చేసి ఉంటే..నాని కామెంట్స్!
 

click me!

Recommended Stories