నివేదా పెతురాజ్‌కు చేదు అనుభవం.. సిగ్నల్ వద్ద బెదిరించి డబ్బులు లాక్కెళ్లిన కుర్రాడు

Published : Nov 04, 2024, 05:24 PM IST

ప్రముఖ నటి నివేదా పెతురాజ్ చెన్నైలోని అడయార్ సిగ్నల్ వద్ద తనకు ఎదురైన ఓ చేదు సంఘటన గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

PREV
14
నివేదా పెతురాజ్‌కు చేదు అనుభవం.. సిగ్నల్ వద్ద బెదిరించి డబ్బులు లాక్కెళ్లిన కుర్రాడు
నటి నివేదా పెతురాజ్

మదురైలో పుట్టిన నివేదా పెతురాజ్ 11 ఏళ్ల వయసు నుంచి దుబాయ్‌లో నివసించారు. అక్కడే చదువు పూర్తి చేసి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. 2015లో మిస్ ఇండియా యుఏఈ పోటీల్లో గెలిచారు. అదే ఏడాది మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2015 పోటీల్లో టాప్ 5లో నిలిచారు.

 

24
నటి నివేదా పెతురాజ్

2016లో 'ఒరు నాళ్ కూత్తు' సినిమాతో తమిళ  తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటించారు.టిక్ టిక్ టిక్, మెంటల్ మదిలోవంటి సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. 2023లో 'BOO' సినిమాలో కీలక పాత్ర పోషించారు.

34
నటి నివేదా పెతురాజ్

అడయార్ సిగ్నల్ వద్ద ఆగినప్పుడు 8 ఏళ్ల బాలుడు డబ్బులు అడిగాడని, డబ్బులు ఇవ్వనని చెప్పగా, ఓ పుస్తకం చూపించి 100 రూపాయలు అడిగాడని, 100 రూపాయలు తీస్తుండగా 500 రూపాయలు ఇవ్వమని అడిగాడని నివేదా తెలిపారు.

44
అడయార్ సిగ్నల్

500 రూపాయలు అడగడంతో పుస్తకం తిరిగి ఇచ్చి, ఇచ్చిన 100 రూపాయలు తీసుకున్నానని, ఆ బాలుడు పుస్తకం కారులోకి విసిరి డబ్బులు లాక్కుని పారిపోయాడని నివేదా పేర్కొన్నారు. ఇలా బెదిరింపులతో భిక్షాటన చేయడం సర్వసాధారణమేనా అని ప్రశ్నించారు.

 

Read more Photos on
click me!

Recommended Stories