సమంత కొత్త బాధ్యతలు.. మెగా ఫోన్‌ పట్టబోతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్ చేస్తుందా?

Published : Aug 24, 2025, 12:06 AM IST

సమంత ఇప్పటి వరకు హీరోయిన్‌గా తానేంటో నిరూపించుకుంది. నిర్మాతగానూ అదరగొట్టింది. ఇప్పుడు మరో బాధ్యతలు తీసుకుంటుందట. మెగా ఫోన్‌ పట్టబోతుందట. 

PREV
15
కొత్త బాధ్యతలు తీసుకోబోతున్న సమంత

స్టార్‌ హీరోయిన్‌ సమంత దాదాపు రెండేళ్లపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. తాను మయోసైటిస్‌ అనే వ్యాధి బారిన పడిన నేపథ్యంలో దాన్నుంచి కోలుకునేందుకు బ్రేక్‌ తీసుకుంది. ఇప్పుడు మళ్లీ బిజీ అవుతుంది. ఓ వైపు హీరోయిన్‌గా బిజీ అవుతుంది. అదే సమయంలో నిర్మాతగానూ బిజీ కానుంది. ఇప్పుడు మరో బాధ్యతలు తీసుకోబోతుంది. సమంత దర్శకురాలిగా మారబోతుందట. ఈ వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

25
దర్శకురాలిగా మారబోతున్న సమంత

సమంత నటిగా నిరూపించుకుంది. లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌ కూడా చేసి అదరగొట్టింది. మరోవైపు నిర్మాతగా మారి ఆ మధ్య `శుభం` అనే మూవీని నిర్మించింది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో నిర్మాతగా మరిన్ని మంచి కాన్సెప్ట్‌ చిత్రాలను చేసేందుకు రెడీ అవుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు దర్శకురాలిగానూ తానేంటో నిరూపించుకోవాలనుకుంటుందట. క్రియేటివ్‌ పరంగా తన ప్రతిభని చాటుకోవాలనుకుంటుందట. ఈ మేరకు ప్రస్తుతం స్క్రిప్ట్ రాస్తుందని, త్వరలోనే ఈ మూవీని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం.

35
సమంత చేస్తోన్న సినిమాలు

ఈ మూవీని తన బ్యానర్‌లోనే తనే నిర్మాతగా రూపొందించబోతుందట సమంత. ఇందులో అంతా కొత్తవాళ్లే నటిస్తారని సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పై సమంత వర్క్ చేస్తుందని, త్వరలోనే క్లారిటీ రాబోతుందని తెలుస్తోంది. ఇక ఇప్పుడు రాజ్‌, డీకే లతో `రక్త్ బ్రహ్మాండ్‌` అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది సమంత. దీంతోపాటు `మా ఇంటి బంగారం` అనే మూవీ చేయాల్సి ఉంది. ఇది ఉంటుందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. దీంతోపాటు అల్లు అర్జున్‌, అట్లీ మూవీలోనూ సమంత పేరు వినిపిస్తోంది.

45
రాజ్‌ నిడిమోరుతో డేటింగ్‌

సమంత ఇటీవల ఓ విషయంలో వార్తల్లో నిలుస్తోంది. ఆమె దర్శకుడు రాజ్‌ నిడుమోరుతో ప్రేమలో ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల చాలా సందర్భాల్లో ఆమె రాజ్‌ నిడిమోరుతో క్లోజ్‌గా కనిపించింది. ఈ ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకుని అమెరికాలో తిరిగారు కూడా. ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది సమంత. ఇది రూమర్లకి మరింత బలం చేకూరింది. అయితే తమ రిలేషన్‌పై ఈ ఇద్దరు ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్‌ చేయకపోవడం గమనార్హం.

55
ఒంటరిగానే ఉండిపోయిన సమంత

15ఏళ్ల క్రితం `ఏం మాయ చేసావే` చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది సమంత. ఇందులో నాగచైతన్యతో కలిసి నటించి విజయాన్ని అందుకుని టాలీవుడ్‌లో స్టార్ అయిపోయింది. ఆ తర్వాత టాప్‌ హీరోలందరితోనూ కలిసి నటించి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. మరోవైపు తన తొలి సినిమా హీరో నాగచైతన్యతో ప్రేమలో పడింది. కొన్నాళ్లపాటు ప్రేమించుకుని 2017లో పెళ్లి చేసుకున్నారు. కొంత కాలం బాగానే ఉన్నా, ఈ ఇద్దరు సడెన్‌గా 2021లో విడాకులు ప్రకటించారు. కరెక్ట్ గా నాలుగు ఏళ్లకే తమ బంధానికి ముగింపు పలికారు. ఆ తర్వాత నాగచైతన్య.. మరో హీరోయిన్‌ శోభితా దూళిపాళని పెళ్లి చేసుకోగా, సమంత మాత్రం ఒంటరిగానే ఉంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories