Samantha: మళ్లీ పేరు మార్చుకోనున్న సమంత? కొత్త సినిమా టైటిల్ కార్డులో ఇదే పేరు?

Published : Jan 26, 2026, 04:09 PM IST

Samantha: సమంత మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తోంది. దీనికి మూల కథను అందించింది ఆమె భర్త రాజ్ నిడుమోరు. ఇక దర్శకత్వం వహిస్తున్నది నందిని రెడ్డి. ఈ సినిమా టైటిల్ కార్డులో సమంత పేరు మార్చుకోనున్నట్టు తెలుస్తోంది. 

PREV
13
సమంత మొదటి పెళ్లి

సమంత మొదటి పెళ్లి కాకముందు సినిమా టైటిల్ కార్డులో సమంతా రూత్ ప్రభు అనే పేరు వచ్చేది. అయితే అక్కినేని ఇంటి కోడలిగా మారిన తర్వాత సమంత అక్కినేని అనే టైటిల్ కార్డ్స్ లో వేసుకోవడం మొదలుపెట్టింది. ఇన్ స్టాగ్రామ్ ఖాతాకు కూడా సమంత రూత్ ప్రభు అక్కినేని అని పెట్టుకుంది. వీరి కాపురం కొన్నేళ్లు మాత్రమే సజావుగా నడిచింది. వీరిద్దరికీ గొడవలు మొదలయ్యాక సమంత మొదట ఇన్స్టాగ్రామ్ లోని తన పేరు నుంచి అక్కినేని అనేది తీసేసింది. దాంతోనే ఎంతోమందికి నాగచైతన్య సమంత విడిపోతున్నట్టు అనుమానం వచ్చింది. ఇక వీరిద్దరూ అధికారికంగా విడాకులు తీసుకున్నాక అక్కినేని అన్న ఇంటి పేరు పూర్తిగా కోల్పోయింది సమంత.

23
సమంతకు కొత్త పేరు

ఇప్పుడు సమంత రెండో పెళ్లి చేసుకుంది. ఆమె పెళ్లి చేసుకున్నది మరో తెలుగు వ్యక్తి రాజ్ నిడుమోరును. అయితే ఇప్పుడు రాబోయే సినిమాలో ఆమె తన పేరును సమంత నిడుమోరుగా మార్చుకోనున్నట్టు తెలుస్తోంది. సమంత ప్రధాన పాత్రలో మా ఇంటి బంగారం అనే సినిమా షూటింగ్ జరుగుతోంది. నందిని రెడ్డి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాకు కథను అందించింది రాజ్ నిడుమోరు. ఈ సినిమా టైటిల్ కార్డులో సమంత నిడుమోరుగా రాబోతోందని సమాచారం. రెండో పెళ్లయిన తర్వాత వస్తున్న మొదటి చిత్రం ఇది. 

అలాగే ఈ మధ్యలో సమంత సినిమాల్లో గ్యాప్ ఎక్కువే తీసుకుంది. ఖుషీ తర్వాత కూడా ఆమె ఏ సినిమా చేయలేదు. బాలీవుడ్ లో నిలదొక్కునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి రాజ్ నిడుమోరును పెళ్లి చేసుకుంది. తర్వాత శుభం సినిమాతో నిర్మాతగా మారింది. నటిగా ఆమె పెళ్లి తర్వాత చేస్తున్న సినిమా మా ఇంటి బంగారం.

33
ఇంటి పేరు మార్చుకుంటున్న హీరోయిన్లు

సమంత, దర్శకుడు రాజ్ నిడుమోరు ప్రేమ కథకు ది ఫ్యామిలీ మ్యాన్ 2 కారణం. ఈ సెట్స్ లోనే వీరిద్దరికీ పరిచయమైంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి సిటాడల్ హనీ బన్నీ కూడా చేశారు. అప్పటి వరకు ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారింది. కొంతకాలం ఎవరికీ తెలియకుండా రహస్యంగా డేటింగ్ చేశారు. అప్పటికే రాజ్ నిడుమోరు పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. కానీ వారి వివాహ బంధం లో గొడవలు ఉన్నాయి. 2022లోనే విడాకులు కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. మొదటి భార్యతో విడాకులు తీసుకోవడంతో రాజ్ నిడిమోరు సమంతను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి పెళ్లి డిసెంబర్ 1న, 2025 కోయంబత్తూర్ లోని ఈషా యోగా సెంటర్లోని లింగ భైరవి ఆలయంలో జరిగింది. కేవలం పది మంది మధ్య ఈ వివాహం జరిగినట్టు తెలుస్తోంది. వీరిద్దరికీ వయసులో 8 సంవత్సరాలకు పైగా తేడా ఉంది. కానీ ఇద్దరి ఆలోచనలు, అభిరుచులు కలవడంతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు.

సమంతలాగే తెలుగు హీరోలను పెళ్లి చేసుకున్న ఎంతోమంది వారి పేర్లను మార్చుకున్నారు. మహేష్ ను పెళ్లి చేసుకున్న తరువాత తన పేరుకు నమ్రత ఘట్టమనేని అనే ఇంటిపేరును జోడించుకుంది. అలాగే వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకున్నాక లావణ్య త్రిపాఠి కొణిదెలగా మారింది. నాగచైతన్యను పెళ్లి చేసుకున్న శోభిత ధూళిపాళ మాత్రం ఇంకా ఇన్ స్టాగ్రామ్ లో తన పాత పేరుని కొనసాగిస్తోంది. మొన్న విడుదలైన చీకటిలో సినిమాల్లో కూడా టైటిల్ కార్డులో శోభిత ధూళిపాళ అనే పేరు పడింది. శోభితా ఎప్పుడు ఇంటి పేరును మార్చుకుంటుందో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories