Soundarya: సౌందర్య మరణ వార్తతో చిత్ర పరిశ్రమ మొత్తం అప్పట్లో ఉలిక్కి పడింది. కానీ ఒక్క స్టార్ హీరో మాత్రం స్పందించలేదు. దానికి కారణం ఆ హీరో వివరించారు.
మహానటి సావిత్రి తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ లో అంతటి మంచి గుర్తింపు సొంతం చేసుకున్న నటి సౌందర్య. అతి తక్కువ కాలంలో దాదాపు 100 సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులని సౌందర్య అలరించారు. అగ్ర హీరోలందరితో సౌందర్య నటించారు. కానీ 2004లో దురదృష్టవశాత్తూ సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.
25
చిత్ర పరిశ్రమలో విషాదం
సౌందర్య మరణంతో చిత్ర పరిశ్రమ మొత్తం ఉలిక్కిపడింది. ఆమె సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఆమె నటించిన వారంతా విషాదం వ్యక్తం చేస్తూ స్పందించారు. కానీ ఒక్క హీరో తప్ప సౌందర్య మరణం గురించి స్పందించలేదు. తనకి స్పందించాలని అనిపించలేదని అన్నారు. పైగా ఆ హీరో సౌందర్యతో చాలా చిత్రాల్లో నటించారు.
35
జగపతి బాబు మాత్రం స్పందించలేదు
వాళ్ళిద్దరిదీ సూపర్ హిట్ కాంబినేషన్. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. జగపతి బాబు. ఆయన ఓ ఇంటర్వ్యూలో సౌందర్య డెత్ గురించి మాట్లాడారు. సౌందర్య మరణించినప్పుడు నేను మలేషియాలో ఉన్నాను. సౌందర్య చనిపోయినట్లు నాకు ఫోన్ వచ్చింది. నాకు ఆమె మరణం గురించి స్పందించాలని అస్సలు అనిపించలేదు. ఆ టైంలో నేను ఆలోచించింది ఒక్కటే.. సౌందర్య బ్రదర్ అమర్ పరిస్థితి ఏంటి ? ఎలా ఉన్నాడు ? అని మాత్రమే ఆలోచించా. నేను నమ్మేది ఒక్కటే ప్రతి ఒక్కరూ చనిపోవలసిందే. కానీ వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని మాత్రం ఆలోచించాను.
ఆ టైంలో నా మైండ్ లో సౌందర్య మరణం కంటే.. ఆమె బ్రదర్ అమర్.. వాళ్ళ అమ్మ నాన్న, ఇతర కుటుంబ సభ్యులు వాళ్ళందరి పరిస్థితి ఏంటి ? వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి అని మాత్రమే ఆలోచించా. అంతకు ముందు నాకు, సౌందర్యకి సంబంధం అంటగట్టారు. సౌందర్య అంటే నాకు ఇష్టం ఉంది, మంచి ఫ్రెండ్ అంత వరకు మాత్రమే.
55
దర్శకుడి కోసం వెళితే..
ఒకరోజు డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారిని రిసీవ్ చేసుకోవడానికి రైల్వేస్టేషన్ కి వెళ్ళా. అదే ట్రైన్ లో సౌందర్య కూడా వచ్చింది. అంతే మీడియా మొత్తం నేను సౌందర్య కోసమే వెళ్లానని.. తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు రాసేశారు. ఆ వార్తలు చూసి చాలా కోపం వచ్చింది అని జగపతి బాబు తెలిపారు. ఆ రోజు సౌందర్య మరణించినప్పుడు నేను ముందుగా అడిగింది వాళ్ళ బ్రదర్ అమర్ గురించే. అంటే నాకు అమర్ తో కూడా సంబంధం అంటగట్టేస్తారా అని జగపతి బాబు ప్రశ్నించారు.