నటి ఈషా రెబ్బా తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ వ్యక్తితో తాను రిలేషన్ లో ఉన్న విషయాన్ని ఆమె అంగీకరించారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
తెలుగు అమ్మాయిగా సినిమాల్లోకి వచ్చి నటిగా రాణిస్తోంది ఈషా రెబ్బా. తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈషా రెబ్బా నటించిన ఓం శాంతి శాంతి శాంతిః అనే చిత్రం జనవరి 30న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించారు. ఏ ఆర్ సజీవ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.
25
డైరెక్టర్ తో త్వరలో పెళ్లి ?
ఫన్ అండ్ రొమాంటిక్ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈషా రెబ్బా ఈ మూవీ ప్రమోషన్స్ తో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. తాజాగా ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఈషా రెబ్బా ఈ చిత్ర విశేషాలు పంచుకున్నారు. అదే విధంగా తన పర్సనల్ లైఫ్ గురించి కూడా మాట్లాడారు. గత కొంత కాలంగా ఈషా రెబ్బా ఈ మూవీ హీరో తరుణ్ భాస్కర్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
35
రూమర్స్ ని ఖండించని ఈషా రెబ్బా
దీనిపై ఈషా రెబ్బా తాజాగా స్పందించారు. తరుణ్ భాస్కర్ తో రిలేషన్ లో ఉన్నట్లు వస్తున్న వార్తలని ఆమె ఖండించలేదు, అలాగని అంగీకరించలేదు. కానీ తాను ఒక వ్యక్తితో రిలేషన్ లో ఉన్నది మాత్రం వాస్తవం అని కంఫర్మ్ చేశారు. తరుణ్ భాస్కర్ తో రిలేషన్ లో ఉన్నారు, పెళ్లి చేసుకోబోతున్నారు అని అంటున్నారు.. దీనిపై మీ స్పందన ఏంటి అని అడగగా.. నేనేం చెప్పడానికి లేదు, మా డాడీ కూడా పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఆయన డేట్ చెబితే నేను మీకు చెబుతా.
త్వరగా పెళ్లి చేసుకోకుంటే నా డీటైల్ మాట్రిమోనీ సైట్ లో పెడతా అని అంటున్నారు. నేనైతే ఒక వ్యక్తితో రిలేషన్ లో ఉన్నా. కానీ పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి కదా అందులో నిజం లేదు. పెళ్లి అంటే మనం అనుకున్న వెంటనే జరిగిపోదు కదా అని ఈషా రెబ్బా తెలిపారు.
55
ట్రైలర్ తో సినిమాకి మంచి బజ్
ఇటీవల విడుదలైన ట్రైలర్ తో ఓం శాంతి శాంతి శాంతిః చిత్రంపై మంచి బజ్ ఏర్పడింది. ఈషా రెబ్బా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందు ఆ తర్వాత, అమీ తుమీ, అరవింద సమేత, రాగల 24 గంటల్లో లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తరుణ్ భాస్కర్ టాలీవుడ్ లో దర్శకుడిగా, నటుడిగా రాణిస్తున్నారు.