సమంత కొత్త కండీషన్స్?.. అంత పారితోషికం ఇస్తేనే తన వద్దకు రావాలంటూ రూల్‌.. డిమాండ్‌ చేస్తున్న ఫ్యాన్స్

Published : Aug 28, 2022, 11:09 AM ISTUpdated : Aug 28, 2022, 02:14 PM IST

స్టార్‌ హీరోయిన్‌ సమంత బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో దూసుకుపోతుంది. ఆమె సినిమాల లైనప్‌ చూస్తుంటే షాకిచ్చేలా ఉన్నాయి. అదే సమయంలో రెమ్యూనరేషన్‌ విషయంలోనూ షాకిస్తుందీ అందాల భామ. 

PREV
15
సమంత కొత్త కండీషన్స్?.. అంత పారితోషికం ఇస్తేనే తన వద్దకు రావాలంటూ రూల్‌.. డిమాండ్‌ చేస్తున్న ఫ్యాన్స్

సమంత(Samantha) పారితోషికం తరచూ హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఒక్కో సినిమాకి ఆమె మూడు కోట్లు, నాలుగు కోట్లు, ఐదు కోట్లు డిమాండ్‌ చేస్తుందని అంటున్నారు. ఇవన్నీ పుకార్లుగానే ఉన్నాయి తప్పితే ఇప్పటి వరకు వాస్తవంగా ఆమె అందుకుంటున్న రెమ్యూనరేషన్‌ ఎంతనేది క్లారిటీ లేదు. ఇప్పుడు ఆ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది.

25

ఇదిలా ఉంటే తాజాగా మరోసారి సమంత పారితోషికంపై (Samantha Remuneration) పలు వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు సమంత అన్నీ కథా బలమున్న సినిమాలు చేస్తుంది. బలమైన పాత్రలుంటేనే నటిస్తుంది. అదే సమయంలో పాన్‌ ఇండియా స్థాయి చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతుంది. 
 

35

ఈ నేపథ్యంలో పారితోషికం విషయంలో కొత్త కండీషన్స్ పెడుతుందట. అదేసమయంలో ఆమె ఒక్కో సినిమాకి ఎంత తీసుకుంటుందనే దానిపై కూడా ఓ సరికొత్త వార్త చక్కర్లు కొడుతుంది. సమంత ఒక్కో సినిమాకి ఏకంగా నాలుగు కోట్ల వరకు డిమాండ్‌ చేస్తుందట. మామూలు సినిమాలకు 3.5కోట్లు తీసుకుంటుందట. ఇదే మినిమమ్‌ రెమ్యూనరేషన్‌ అని, అంతకంటే తక్కువకి చేయనని కండీషన్స్ పెడుతుందట. 

45

3.5కోట్ల కంటె తక్కువ రెమ్యూనరేషన్‌ ఆఫర్ చేసిన సినిమాలను రిజెక్ట్ చేస్తుందని, ముందు ఆ అమౌంట్‌కి ఓకే అనుకుంటేనే ముందుకెళ్తామనే కండీషన్స్ పెడుతుందని సమాచారం. అయితే సమంతకి ఉన్న క్రేజ్‌, ఫాలోయింగ్‌ దృష్ట్యా అదే పెద్దదేం కాదు, ఆమెకి ఐదు కోట్లు ఇచ్చినా తక్కువే అంటున్నారు అభిమానులు. అంతేకాదు సమంత రేంజ్‌కి మినిమమ్‌ ఐదు కోట్లు ఇచ్చేలా కండీషన్స్ పెట్టాలని అభిమానులు కోరుతుండటం విశేషం. ఐదు కోట్లు ఇచ్చినా తక్కువే అంటున్నారు. 
 

55
Samantha

సమంత ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఆ మొత్తం ఇచ్చేందుకు నిర్మాతలు వెనకాడకపోవడం విశేషం. అది సామ్‌ రేంజ్‌ని చాటి చెబుతుందని చెప్పొచ్చు. అదే సమయంలో పూజా హెగ్డే, రష్మిక మందన్నా వంటి హీరోయిన్లకి దీటుగా అందుకుంటుందని చెప్పొచ్చు. సమంత ప్రస్తుతం `ఖుషి`, `యశోద`,`శాకుంతలం` చిత్రాల్లో నటిస్తుంది. బాలీవుడ్‌లో ఆయుష్మాన్‌ ఖురానా, అక్షయ్‌ కుమార్‌లతో కలిసి నటించే అవకాశాలను అందుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు `పుష్ప2`లోనూ మెరవబోతందని సమాచారం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories