Samantha: సమంత ఫామ్ హౌస్ కోసమే ఒప్పుకుందా, తమన్నాని బతిమాలితే ఏం చేసిందో తెలుసా ?

Published : Jan 31, 2026, 11:18 AM IST

Samantha: సమంత తన క్రేజ్ ని రిస్క్ లో పెట్టి చేసిన సినిమా ఒకటి ఉంది. ఫామ్ హౌస్ కోసమే ఆ సినిమా ఒప్పుకుందా అనే ప్రచారం ఉంది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
సమంత తొలి చిత్రం

సౌత్ లో తిరుగులేని స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. సమంత ఏ మాయ చేసావె చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంతోనే యువతలో సమంతకి క్రేజ్ వచ్చేసింది. ఆ మూవీ చైతు, సమంత మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఆ తర్వాత సమంతకి అవకాశాలు క్యూ కట్టాయి. మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రాంచరణ్ ఇలా అగ్ర హీరోల సినిమాల్లో నటించి భారీ విజయాలు సొంతం చేసుకుంది.

25
స్టార్ హీరోలతో నటిస్తున్నప్పుడు రిస్క్ చేసిన సమంత

అత్తారింటికి దారేది, మనం లాంటి భారీ చిత్రాలు చేస్తున్న సమయంలో సమంత తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీ మొత్తాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. కెరీర్ పీక్ లో ఉన్న సమయంలో బెల్లంకొండ శ్రీనివాస్ డెబ్యూ చిత్రానికి ఒకే చెప్పింది. అల్లుడు శీను చిత్రంలో హీరోయిన్ గా నటించింది. సమంతకి ఉన్న క్రేజ్ కి ఈ సినిమా చేయడం ఏంటి అని అంతా ఆశ్చర్యపోయారు. అసలు బెల్లంకొండ శ్రీనివాస్ కి హీరోయిన్ గా నటించడానికి సమంత ఎందుకు ఒప్పుకుంది అనే చర్చ జరిగింది.

35
ముందుగానే ఎంపిక చేశాం

ఈ ప్రశ్నకు నిర్మాత బెల్లంకొండ శ్రీనివాస్ ఓ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చారు. అల్లుడు శీను చిత్రానికి డిస్కషన్స్ మొదలయ్యే సరికి సమంత రెండు మూడు సినిమాలు మాత్రమే చేసింది. ప్రారంభంలోనే సమంతని ఓకె చేశాం. సినిమాని గ్రాండ్ గా తీయాలని ఉద్దేశంతో కాస్త ఎక్కువ సమయం పట్టింది. ఈ గ్యాప్ లో సమంత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయినప్పటికీ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుంది.

45
ఫామ్ హౌస్ తీసుకున్న సమంత

అయితే సమంతకి రెమ్యునరేషన్ ఇవ్వలేదు. రెమ్యునరేషన్ బదులు నా దగ్గర ఫామ్ హౌస్ ఉంటే అది ఇచ్చాను అని బెల్లంకొండ సురేష్ అన్నారు. ఆ సమయంలో సమంత ఫామ్ హౌస్ కొనాలనే ప్రయత్నాల్లో ఉంది. నా దగ్గర 3 ఫామ్ హౌస్ లు ఉన్నాయి. అందులో ఒకటి సమంతకి ఇచ్చాను అని అన్నారు. వాస్తవానికి దీనిని ఇద్దరు హీరోయిన్ల కథగా అనుకున్నాం. అందుకే తమన్నాని కూడా ఎంపిక చేశాం. కానీ చివరికి ఒక హీరోయిన్ కథగానే ఫిక్స్ చేశాం.

55
తమన్నా అందుకే ఐటెం సాంగ్ చేసింది

తమన్నాని రిక్వస్ట్ చేసి ఐటెం సాంగ్ కోసం అడిగాం. నాకున్న గుడ్ విల్ తో వెంటనే ఒప్పుకుంది. ఇప్పుడు తమన్నా ఒక ఐటెం సాంగ్ కి 3 నుంచి 4 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంది. కానీ అప్పట్లో అల్లుడు శీను చిత్రానికి తాను 90 లక్షలు ఇచ్చినట్లు బెల్లంకొండ సురేష్ తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories