చిరంజీవి.. తాను రొమాన్స్ చేసిన కాజల్ అగర్వాల్, తమన్నా ల గురించి క్రేజీ కామెంట్ చేశారు. తనకు కాజల్, తమన్నా ఎవరో కూడా తెలియదని తెలిపారు. మరి దీని వెనుకున్న అసలు కథేంటంటే?
మన శంకర వర ప్రసాద్ గారు మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే సంక్రాంతికి `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీతో హిట్ కొట్టాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మూడు వందల కోట్లకుపైగా వసూళ్లని సాధించింది. టీమ్ ఇప్పటికే రూ.360కోట్లకుపైగా వసూళ్లు వచ్చినట్టు ప్రకటించారు. ఇప్పుడు మూవీ థియేటర్లలో దాదాపు క్లోజ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. మొత్తానికి ఇది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది.
25
రాజకీయాల్లో సక్సెస్ కాలేని చిరంజీవి
ఈ క్రమంలో చిరంజీవి ఇటీవల మీడియా ప్రతినిధులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. తనకు చాలా రోజుల తర్వాత సక్సెస్ వచ్చిన నేపథ్యంలో తన సంతోషాన్ని వ్యక్తిగతంగా పంచుకున్నారు. అందులో భాగంగా పలు ఆసక్తికర విషయాలను షేర్ చేశారు చిరంజీవి. అందులో భాగంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను వెల్లడించారు. చిరంజీవి 2008 నుంచి సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నారు. ఆయన రాజకీయాల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. ప్రజారాజ్యం స్థాపించి ఎన్నికల్లోకి వెళ్లారు. కానీ అధికారంలోకి రాలేకపోయారు. కొన్నాళ్ల తర్వాత తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశారు. కేంద్ర మంత్రి అయ్యారు.
35
అభిమానుల ఆకలి తీర్చిన మన శంకర వర ప్రసాద్ గారు
2017 నుంచి మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు `ఖైదీ నెంబర్ 150` చిత్రంతో ఆయన రీఎంట్రీ ఇచ్చి అదరగొట్టారు. వరుసగా సినిమాలు చేస్తూ వచ్చారు. `సైరా`, `వాల్తేర్ వీరయ్య`, `గాడ్ ఫాదర్`, `భోళా శంకర్`, `ఆచార్య` వంటి చిత్రాల్లో నటించారు. అయినా ఏదో లోటు. ఆయన రేంజ్ హిట్ పడటం లేదనే వెలితి ఉండేది. దాన్ని ఇప్పుడు `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీ భర్తీ చేసింది. మెగా అభిమానుల ఆకలి తీర్చింది. ఈ మూవీని అభిమానులు ఒక సెలబ్రేషన్‌లా ఫీల్ కావడం విశేషం.
ఇదిలా ఉంటే తాను సినిమాల నుంచి దూరమైన సందర్భాన్ని చిరంజీవి పంచుకుంటూ ఆ తర్వాతి తరం హీరోయిన్లు ఎవరో కూడా తనకు తెలియదని తెలిపారు. `నేను రాజకీయాల్లోకి వెళ్లాక సినిమాల నుంచి పూర్తిగా డిస్ కనెక్ట్ అయ్యాను. `ఖైదీ నెం 150`కి హీరోయిన్ కాజల్ అన్నప్పుడు, కాజల్ ఎవరు అని అడిగా. తమన్నా కూడా ఎవరో తెలిసేది కాదు. అంతలా డిస్ కనెక్ట్ అయిపోయా` అని తెలిపారు చిరంజీవి. కాజల్‌తో `ఖైదీ నె 150`, `ఆచార్య` చిత్రాల్లో నటించారు. కాకపోతే `ఆచార్య` నుంచి ఆమె సీన్లు తొలగించారు. ఇక తమన్నాతో `సైరా`, `భోళా శంకర్` చిత్రాలు చేశారు చిరు. దాదాపు 9 ఏళ్లు ఆయన సినిమాలు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఒక తరానికి దూరమయ్యరు. ఇప్పుడు లేటెస్ట్ మూవీతో ఈ జనరేషన్‌కి కూడా దగ్గరయ్యారు.
55
చిరంజీవి నెక్ట్స్ మూవీస్
చిరంజీవి ఈ ఏడాది `విశ్వంభర` సినిమాతో రాబోతున్నారు. ఇది జులైలో విడుదల కానుంది. దీంతోపాటు బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. మార్చిలో ఇది ప్రారంభం కానుంది. అలాగే శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబోలో వస్తున్న `స్పిరిట్` మూవీలో కూడా చిరంజీవి మెరుస్తారని సమాచారం.