
అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హాట్ బ్యూటీగా పేరుతెచ్చుకుంది. అందాలు ఆరబోస్తూ హాట్ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్ పిక్స్ ని పంచుకుంటూ సామాజిక మాధ్యమాల్లో మంటలు పుట్టిస్తుంది. కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది.
తాజాగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor Hot Photo Shoot) ఫైరింగ్ మోడ్‌లోకి వెళ్లింది. క్లీవేజ్ అందాలను చూపిస్తూ ఫైరింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సెక్సీ పోజులిచ్చింది. ఫోటో షూట్‌కి ఈ రేంజ్‌లో పరువాల విందు వడ్డించడంతో ఫోటో గ్రాఫర్లు రెచ్చిపోయారు. జాన్వీ లోని హాట్ యాంగిల్స్ ని కెమెరాల్లో బంధించగా, వాటిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది జాన్వీ కపూర్. ప్రస్తుతం ఆయా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
జాన్వీ కపూర్ పంచుకున్న ఈ లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్నాయి. ఘాటెక్కించే జాన్వీ అందాలు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి. కుర్రాళ్లని ఉలిక్కిపాటుకి గురి చేస్తున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. జాన్వీని ఇలా చూసిన నెటిజన్లు విజువల్ ట్రీట్ అదిరిందని, సండే ట్రీట్ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు జాన్వీ అందాల దాడితో వామ్మో ఇదెక్కడి అరాచకం అంటూ పోస్ట్ లు పెడుతుండటం విశేషం.
జాన్వీ కపూర్ సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే యాక్టివ్‌గా ఉంటుంది. తనకి సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో షేర్ చేసుకుంటోంది. ట్రెండ్‌ని ఫాలో అవుతూ ఇంటర్నెట్ అభిమానులకు నిత్యం టచ్‌లో ఉంటూ తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది జాన్వీ.
అందులో భాగంగా ఎక్కువగా హాట్ ఫోటోలను పంచుకుంటుంది జాన్వీ. పేరుకే అతిలోక సుందరి శ్రీదేవి కూతురు అయినా, ఆమె ప్రారంభం నుంచి అందాల ఆరబోతలో మాత్రం తనకు ఎలాంటి హద్దుల్లేవని చాటుకుంటోంది. మారుతున్న కాలానికి తగ్గట్టుగా మనం మారాలనే విషయాన్ని తన ఫోటో షూట్లతో స్పష్టంగా చాటుకుంటోంది జాన్వీ.
జాన్వీ కపూర్ ఫోటో షూట్ పిక్స్ బార్డర్స్ బ్రేక్ చేసేలా, హద్దులు దాటేలా ఉండటం విశేషం. ఈ అమ్మడి ఫోటో షూట్ పిక్స్ వచ్చాయంటే నెటిజన్లకి, ఆమె ఫ్యాన్స్ కి పండగే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తాజాగా సండే సందర్భంగా ఆమె పంచుకున్న పిక్స్ సైతం బెస్ట్ సండే ట్రీట్‌లా ఉన్నాయంటున్నారు కుర్రాళ్లు. జాన్వీ అందాల జడిలో తడిసి ముద్దవుతున్నారు.
జాన్వీ కెరీర్ పరంగా ఒక్కో మెట్టు ఎక్కుతుంది. స్టార్ డాటర్ అయినా ఒకేసారి భారీ చిత్రాలు చేయడం లేదు. చిన్న చిన్న చిత్రాలతోనే తన కెరీర్‌ని స్టార్ట్ చేసి, నటిగా తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. `దఢక్` చిత్రంతో హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. మరాఠిలో విజయం సాధించిన `సైరత్` చిత్రానికిది రీమేక్. ఇందులో డీసెంట్ యాక్టింగ్‌తో మెప్పించింది. అందరి ప్రశంసలందుకుంది.
ఆ తర్వాత కూడా చిన్న చిత్రాలే చేసుకుంటూ వచ్చింది జాన్వీ. `గుంజన్ సక్సేనా`తో ప్రశంసలందుకుంది. ఇది లేడీ ఓరియెంటెడ్ చిత్రం కావడం విశేషం. దీంతోపాటు `రూహి`లో ఘోస్ట్ పాత్రలో మెస్మరైజ్ చేసింది. ఒకటి అర గెస్ట్ రోల్స్ కూడా చేస్తుంది.
ఇప్పుడు భారీ సినిమాల్లో భాగమవుతుంది జాన్వీ కపూర్. `గుడ్ లక్ జెర్రీ` చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. `మిలి` అనేది చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు `బవాల్` అనే మరో సినిమాలో నటించే ఛాన్స్ ని కొట్టేసింది. `బవాల్` జాన్వీ మొదటి భారీ చిత్రం కావడం విశేషం. ఇందులో వరుణ్ ధావన్‌తో కలిసి రొమాన్స్ చేస్తుంది. ఇది ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు మరికొన్ని ప్రాజెక్ట్ లకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.
మరోవైపు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేసుకుంటుంది జాన్వీ కపూర్. ఆమె విజయ్ దేవరకొండతో `జనగణమన` చిత్రంలో హీరోయిన్‌గా నటించబోతుందనే వార్తలు వినిపించాయి. ఆమె స్థానంలో పూజా హెగ్డేని ఫైనల్ చేసినట్టు టాక్. మరి ఇదే నిజమైతే జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇప్పట్లో లేనట్టే అని చెప్పొచ్చు.