సమంత, నాగ చైతన్య విడిపోవడం వారి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులకు పెద్ద షాక్. ఇప్పటికీ చైసామ్ అభిమానులు వీరిద్దరూ విడిపోవడాన్ని జీర్ణించుకోలేకున్నారు. చైతు, సమంత విడిపోవడంపై మీడియాలో, సోషల్ మీడియాలో ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసలే బాధలో ఉన్న సమంతకి ఈ రూమర్లు పుండుమీద కారంలా మారాయి.