ఏరికోరి ఎంచుకున్న ప్రకాష్ రాజ్.. చేతులు కాల్చుకున్న అనసూయ, సుధీర్.. నెక్స్ట్ ఏంటి ?

First Published Oct 11, 2021, 1:10 PM IST

మా ఎన్నికల యుద్ధం ముగిసింది. మా లో ఉన్నది కేవలం 900లోపు సభ్యులే అయినప్పటికీ ఎన్నికల హంగామా మాత్రం యుద్దాన్ని తలపించింది. గత రెండు నెలలుగా మా ఎన్నికల అంశం మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది.

మా ఎన్నికల యుద్ధం ముగిసింది. మా లో ఉన్నది కేవలం 900లోపు సభ్యులే అయినప్పటికీ ఎన్నికల హంగామా మాత్రం యుద్దాన్ని తలపించింది. గత రెండు నెలలుగా మా ఎన్నికల అంశం మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ సభ్యుల మధ్య విమర్శలు, కౌంటర్స్ తో హోరెత్తింది. చివరకు విష్ణు విజేతగా నిలిచాడు. 'మా' కొత్త ప్రెసిడెంట్ గా మారాడు. 

ఏది ఏమైనా ప్రకాష్ రాజ్ ప్యానల్ లో కూడా కొంతమంది సభ్యులు విజయం సాధించారు. కొందరు ఓటమి చెందారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి కౌశిక్, శివారెడ్డి, సురేష్ కొండేటి ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా విజయం సాధించారు. మిగిలినవారు ఓటమి చెందారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ తరుపున జనరల్ సెక్రటరీగా పోటీ చేసిన జీవిత కూడా ఓటమి చెందారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి శ్రీకాంత్ విజయం సాధించాడు. 

ఇక Prakash Raj ప్యానల్ లో అందరిని ఆకర్షించిన మరో ఇద్దరు బుల్లి తెర సెలెబ్రిటీలు కూడా ఉన్నారు. వారే యాంకర్ అనసూయ, సుడిగాలి సుధీర్. వీరిద్దరూ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా పోటీ చేశారు. ఇద్దరూ ఓటమి చెందడం ప్రకాష్ రాజ్ ప్యానల్ కు కొంత షాకింగ్ గా మారింది. అనసూయ టాలీవుడ్ లో క్రేజీ యాంకర్. నటిగా కూడా రాణిస్తోంది. Sudigali Sudheer బుల్లితెరపై స్టార్ గా ఉన్నాడు. జబర్దస్త్ షోతో సుధీర్ యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. 

వాస్తవానికి వీరిద్దరిపై ప్రకాష్ రాజ్ మంచి హోప్స్ పెట్టుకుని ఉన్నాడు. మీడియా సమావేశంలో కూడా అనసూయ, సుధీర్ పై ప్రకాష్ రాజ్ ప్రశంసలు కురిపించారు. అనసూయ అద్భుతమైన యాంకర్. బుల్లితెరపై సమస్యలు ఆమెకు తెలుసు.అందుకే తీసుకున్నాం అని ప్రకాష్ రాజ్ తెలిపాడు.ఇక సుధీర్ లాంటి యంగ్ స్టర్ కొత్త ఆలోచనలు 'మా'కి బాగా ఉపయోగపడుతాయి అని కితాబిచ్చారు. కానీ చివరకు అనసూయ, సుధీర్ కి నిరాశే మిగిలింది. 

మా ఎన్నికల కోసం వెళ్లి వీరిద్దరూ చేతులు కాల్చుకున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఓడిపోయినప్పుడు ఇలాంటి కామెంట్స్ సహజమే. దీనివల్ల అనసూయ, సుధీర్ కు వచ్చిన నష్టం అయితే ఏమీ లేదు. ఇది వారికి ఒక ప్రయత్నం మాత్రమే అని చెప్పొచ్చు. మా ఎన్నికల హడావిడి ముగిసింది. రేపటి నుంచి ఆర్టిస్టులు అంతా ఈ విషయాలు మరచిపోయి షూటింగ్స్ తో బిజీ అయిపోతారు. 

ఇక 'మా'లో కూడా ఈ విభేదాలు ఎన్నికల వరకే పరిమితం. ఇండస్ట్రీ మొత్తం కలసి కట్టుగా సహకరించుకుంటేనే 'మా' లాంటి సంస్థలు వృద్ధిలోకి వస్తాయి. సో గెలిచిన వాళ్ళు అందరిని కలుపుకొని వెళ్ళాలి. విష్ణు రూపంలో మా కు యంగ్ ప్రెసిడెంట్ దొరికాడు. మా ని విష్ణు ఎంత సమర్థవంతగా నడిపేస్తాడనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. 

Also Read: నా బిడ్డకు చిరు, పవన్ కళ్యాణ్ ఆశీస్సులు ఉండాలి.. మీడియా ముందుకు వెళ్లొద్దు, మోహన్ బాబు కామెంట్స్

click me!