ఇదెక్కడి ట్విస్ట్ బాబూ.! నాగచైతన్యతో సమంత, శోభిత.. అసలు మ్యాటర్ ఇది

Published : Dec 23, 2025, 09:07 AM IST

Naga Chaitanya: ఏంటి.! టైటిల్ చూసి షాక్ అయ్యారా.? సమంత నాగచైతన్యను మళ్లీ కలవడం ఏంటని ఆలోచిస్తున్నారా.? కాస్త మీ ఆలోచనలను స్టాప్ చేయండి.. ఈ స్టోరీ చూశారంటే మొత్తం మీకే అర్ధమవుతుంది. లేట్ ఎందుకు మరి ఓ సారి లుక్కేయండి. 

PREV
15
జోష్‌తో ఎంట్రీ..

'జోష్' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు అక్కినేని వారసుడు అక్కినేని నాగచైతన్య. మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆపై వరుస విజయాలు అందుకుని స్టార్ స్టేటస్ దక్కించుకున్నాడు. మాస్ హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు.

25
సమంతతో ప్రేమ, పెళ్లి..

'ఏ మాయ చేసావే' సినిమాలో నాగచైతన్య, సమంత కలిసి నటించారు. వీరిద్దరూ ప్రేమించి.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి నాలుగేళ్లు కూడా నిలవకముందే.. విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత నాగచైతన్య.. హీరోయిన్ శోభిత దూళిపాళను పెళ్లి చేసుకోగా.. సమంత, రాజ్ నిడిమోరు ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

35
సోషల్ మీడియాలో ఫోటో వైరల్..

తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఇందులో నాగచైతన్య, సమంత, శోభిత కలిసి దిగారు. అయితే సమంత అనగానే.. మళ్లీ వీళ్లిద్దరూ ఎందుకు కలిసారా.? అని అనుకున్నారు. కానీ అక్కడున్నది హీరోయిన్ సమంత కాదు.. శోభిత చెల్లెలు సమంత.

45
శోభిత కంటే ముందే..

శోభిత, నాగచైతన్య కంటే ముందే సమంత పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. పెళ్ళైన ఏడాదికి మరదలు సమంత ఇంటికి వెళ్లిన నాగచైతన్య.. ఆమెతో కలిసి ఫోటో దిగాడు. భార్య ఓ వైపు, మరదలిని ఓ వైపు పెట్టుకుని నాగచైతన్య ఫోటోకు పోజ్ ఇచ్చారు. ఆ ఫోటో ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

55
నెటిజన్లు ఫుల్ హ్యాపీ..

శోభిత చెల్లెలు సమంత అని తెలిసి.. అభిమానులు ఖుషీగా ఉన్నారు. అత్తగారింట్లో నాగచైతన్య బాగానే ఎంజాయ్ చేస్తున్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం నాగచైతన్య.. కార్తీక్ దండు దర్శకత్వంలో ‘వృష కర్మ’ చేస్తున్నాడు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories