కళ్యాణ్ పడాల విజయం వెనుక ఉన్నది ఎవరో తెలుసా, కథ మొత్తం నడిపించింది ఆమెనే.. అగ్గిపుల్ల వెలిగించి మరీ

Published : Dec 23, 2025, 08:30 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో కళ్యాణ్ పడాల విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే కళ్యాణ్ విజయం వెనుక ఉన్నది ఎవరు అనే నిజాలు నెమ్మదిగా వెలుగులోకి వస్తున్నాయి. 

PREV
15
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగిసింది కానీ ఆ హంగామా ఇంకా ముగియలేదు. కళ్యాణ్ పడాల అభిమానులు ఇంకా సక్సెస్ సెలెబ్రేషన్స్ లోనే ఉన్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో కామనర్ గా కళ్యాణ్ అడుగుపెట్టాడు. అగ్ని పరీక్షలో సత్తా చాటి బిగ్ బాస్ కు అర్హత సాధించాడు. తొలి మూడు వారాలు కళ్యాణ్ హౌస్ లోన్ సైలెంట్ గా ఉండిపోయాడు. ఎలిమినేషన్ గండం నుంచి కూడా తప్పించుకున్నాడు. 

25
స్ట్రాటజీ మార్చిన కళ్యాణ్ 

కానీ తన గేమ్ స్ట్రాటజీ మార్చుకుని ప్రతీవారం తన పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. ప్రతి టాస్క్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ టాప్ రేసులోకి దూసుకువచ్చాడు. బిగ్ బాస్ టైటిల్ దక్కించుకోవడానికి కళ్యాణ్ హౌస్ లోపల ఎంత చేయాలో అంతా చేశాడు. హౌస్ బయట కళ్యాణ్ కి తన అభిమానుల నుంచి మంచి సపోర్ట్ దక్కింది. కానీ ఊహించని విధంగా ఒక వ్యక్తి కళ్యాణ్ కి బలమైన సపోర్ట్ ఇచ్చారు. 

35
కళ్యాణ్ కి గీతూ రాయల్ సపోర్ట్ 

ఆమె ఎవరో కాదు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ గీతూ రాయల్. గీతూ రాయల్.. కళ్యాణ్ కోసం ఒక రేంజ్ లో ప్రమోషన్స్ చేసిందట. కళ్యాణ్ బిగ్ బాస్ టైటిల్ గెలిచి బయటకి రాగానే అతడిచేత కేక్ కట్ చేయించి సెలెబ్రేషన్స్ చేసింది. ఈ సెలబ్రేషన్స్ లో ప్రియా శెట్టి, దమ్ము శ్రీజ కూడా పాల్గొన్నారు. 

45
స్టేజీ దిగగానే గీతూ రాయల్ గురించే చెప్పింది 

వీళ్లంతా పెద్ద హంగామా చేశారు. తాను టైటిల్ గెలిచి స్టేజీ దిగి రాగానే ప్రియా శెట్టి ముందుగా నీ గురించే చెప్పింది అని కళ్యాణ్ గీతూతో అన్నాడు. గీతూ నీకోసం అద్భుతంగా ప్రమోషన్స్ చేసింది అని ప్రియా శెట్టి చెప్పింది. నాలుగు గంటలు లైవ్ లో కూర్చుని ఒక్కొక్కడికీ ఇచ్చిపడేసింది అని ప్రియా చెప్పినట్లు కళ్యాణ్ గీతూతో అన్నాడు. 

55
అందరూ తనూజ అన్నారు, నేను నమ్మలేదు 

గీతూ స్పందిస్తూ నేను చేసింది ఏమీ లేదు. నువ్వు గేమ్ అంత బాగా ఆడావు. నీ గేమ్ కి నేను మీడియంగా ఉన్నాను అంతే. క్రెడిట్ మొత్తం నీదే అని గీతూ పేర్కొంది. చివర్లో నువ్వు, తనూజ స్టేజిపైకి వెళ్ళగానే.. నీ గుండె ఎలా కొట్టుకుందో తెలియదు కానీ నా గుండె మాత్రమే చాలా వేగంగా కొట్టుకుంది అని గీతూ తెలిపింది. గ్రాండ్ ఫినాలే రోజు ఉదయం నుంచి తనూజ విన్నర్ అని చెబుతూనే ఉన్నారు. కానీ నేను నమ్మలేదు. కళ్యాణ్ మాత్రమే గెలుస్తాడు అని చెప్పా అంటూ గీతూ పేర్కొంది. పక్కనే ఉన్న దమ్ము శ్రీజ.. కళ్యాణ్ అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు అంటూ అగ్గిపుల్ల వెలిగించి క్రేజీగా చెప్పింది. 

Read more Photos on
click me!

Recommended Stories