Samantha: నాగార్జునకి షాకిచ్చిన సమంత.. `బిగ్‌ బాస్‌ 6`కి హోస్ట్ గా ఫైనల్‌.. ఇంతకి అసలు విషయం ఏంటంటే?

Published : Jun 03, 2022, 03:41 PM ISTUpdated : Jun 03, 2022, 05:43 PM IST

స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న సమంత బిగ్‌బాస్‌ తెలుగు 6 షోకి హోస్ట్ గా చేస్తుందా? నాగార్జునకే పెద్ద షాక్‌ ఇవ్వబోతుందా? త్వరలో ప్రారంభం కాబోయే షోకి సమంత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుందనే వార్తలు ఊపందుకున్నాయి.   

PREV
17
Samantha: నాగార్జునకి షాకిచ్చిన సమంత.. `బిగ్‌ బాస్‌ 6`కి హోస్ట్ గా ఫైనల్‌..  ఇంతకి అసలు విషయం ఏంటంటే?

సమంత(Samantha) ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌. చైతూతో విడాకుల తర్వాతే అసలైన సమంత బయటకు వచ్చారు. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు, ఇంటర్నేషనల్‌ మూవీ చేస్తూ బిజీగా ఉంది. అరడజను ప్రాజెక్ట్ లతో క్షణం తీరిక లేకుండా ఉంది. వ్యక్తిగా ప్రస్తుతం ఆమె స్వేచ్ఛగా ఉంది. ఎలాంటి పట్టింపులు, నియంత్రణ లేదు. దీంతో తనకు నచ్చినట్టు చేస్తుంది. తనకు నచ్చిన విధంగా లైఫ్‌ని లీడ్‌ చేస్తుంది. 
 

27

ఈ క్రమంలో సమంత బిగ్‌ బాస్‌ తెలుగు 6(Bigg Boss Telugu 6) సీజన్‌కి హోస్ట్ గా చేయబోతుందనే వార్త ఇప్పుడు వైరల్‌ అవుతుంది. నాగార్జున(Nagarjuna) స్థానంలో సమంత హోస్ట్ చేస్తుందనే వార్తలు ఊపందుకున్నాయి. టీఆర్‌పీ కోసం బిగ్‌బాస్‌ నిర్వహకులు సమంతని రంగంలోకి దించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది.

37

సమంత ఇప్పటికే హోస్ట్ గా మెరిసింది. బిగ్‌ బాస్‌ 4 సీజన్‌లో రెండు వారాలు సమంత వ్యాఖ్యాతగా(Samantha Bigg Boss 6 Telugu Host) వ్యవహరించింది. నాగార్జున షూటింగ్‌ నిమిత్తం అందుబాటులో లేకపోవడంతో ఆయన స్థానంలో సమంత చేశారు. ఆమె పాల్గొన్న ఎపిసోడ్ల రేటింగ్‌ బాగా వచ్చింది. దీంతో నెక్ట్స్ సీజన్‌కి సమంత హోస్ట్ గా చేయబోతుందన్నారు. కానీ నాగార్జునే నిర్వహించారు. ఇప్పుడు ఆరో సీజన్‌కి సమంత పేరు తెరపైకి రావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

47

ఇదిలా ఉంటే ఇటీవలే బిగ్‌ బాస్‌ 6 సీజన్‌కి సంబంధించిన ఓ అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సారి సాధారణ ప్రజలకు కూడా బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి వచ్చే అవకాశాన్ని కల్పిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రకటనని నాగార్జునతోనే చేయించారు. అయితే ఇందులో ఇద్దరిని మాత్రమే కామన్‌ పీపుల్‌ నుంచి తీసుకోబోతున్నారట. మిగిలిన వారంతా యూట్యూబ్‌ స్టార్స్, యాంకర్లు, సినీ,టీవీ ఆర్టిస్టులు, డాన్స్ మాస్టర్లు, మోడల్స్ ఉండబోతున్నట్టు సమాచారం. 
 

57

మరి నాగార్జున స్థానంలో ఊహించని విధంగా సమంత పేరు రావడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇందులో నిజమెంతా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో సమంత ఫ్యాన్స్ మాత్రం ఇలాంటి షోకి హోస్ట్ గా చేయాల్సిన అవసరం సమంతకి లేదంటున్నారు. ఆమె అంతర్జాతీయ స్థాయిలో పేరుతెచ్చుకుంటోందని, అవకాశాలను దక్కించుకుంటుందని, లోకల్‌ షోలకు ప్రయారిటీ ఇవ్వదని అంటున్నారు. బుర్రతో ఆలోచించండి, సమంత ఇప్పుడు ఈ షో ఎందుకు చేస్తుందని ఎదురు ప్రశ్నిస్తున్నారు ఆమె అభిమానులు. దీంతో ఇదొక రచ్చ అవుతుంది. 

67

అయితే సమంత హోస్ట్ గా చేయబోతుందనే వార్తల్లో నిజం లేదని తెలుస్తుంది. నాగార్జునతో ఆల్‌రెడీ ప్రోమో విడుదల చేయించారు. దీంతో ఆయనే హోస్ట్ అనేది ఫైనల్‌ అంటున్నారు. సమంత వ్యాఖ్యాతగా చేసే పొజీషియన్‌లో లేదని చెబుతున్నారు. కేవలం ఉట్టి పుకార్లే అని సమంత బిగ్‌ బాస్‌ 6 హోస్ట్ అనే వార్తలను కొట్టిపారేస్తున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది చూడాలి. 
 

77

సమంత ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో కలిసి `ఖుషి` చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు `యశోద`, `శాకుంతలం` చిత్రం చేస్తుంది. ఈరెండు చిత్రాలు చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోంది. మరోవైపు ఓ అంతర్జాతీయ సినిమా చేస్తుండగా, మరో బైలింగ్వల్‌ కమిట్‌మెంట్‌ కూడా ఉంది. బాలీవుడ్‌ నుంచి కూడా ఆమెకి ఆఫర్లు వస్తున్నట్టు సమాచారం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories