ప్రెగ్నెన్సీపై ప్రణీత సుభాష్ హార్ట్ ఫెల్ట్ నోట్.. పెరుగుతున్న బరువు, సాగిన చర్మం విలువైనవేనంటూ..

Published : Jun 03, 2022, 03:01 PM IST

హీరోయిన్ ప్రణీత సుభాష్ (Pranitha Subhash) ప్రస్తుతం ప్రెగ్నెన్సీని ఫీలవుతోంది. ఈ క్రమంలో తన బెబీ బంప్ ను చూపిస్తూ ఇప్పటికే చాలా ఫొటోస్ ను షేర్ చేసుకుంది. చివరిగా సారిగా అంటూ మరికొన్ని ఫొటోస్ ను అభిమానులతో పంచుకుంటూ హార్ట్ ఫెల్ట్ నోట్ రాసింది.  

PREV
16
ప్రెగ్నెన్సీపై ప్రణీత సుభాష్ హార్ట్ ఫెల్ట్ నోట్.. పెరుగుతున్న బరువు,  సాగిన చర్మం విలువైనవేనంటూ..

నటి ప్రణీత సుభాష్, గతేడాది మే30న వ్యాపార వేత్త నితిన్ ను ప్రేమించి పెండ్లి చేసుకుంది. కరోనా కారణంగా తన వివాహానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వకుండా ఈ జంట ఒక్కటైంది. ఆ తర్వాత అభిమానులకు వివరణ ఇస్తూ.. కరోనా నేపథ్యంలో డేట్ విషయంలో కన్ష్యూషన్ ఉండటంతో రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. 
 

26

కాగా, నితిన్, సుభాష్ బెంగళూరులో వివాహాం చేసుకుని ఇఫ్పటికీ ఏడాది పూర్తి కావస్తోంది. ఈ లోపే ప్రణీత తన అభిమానులకు శుభవార్త చెప్పింది. త్వరలో తను తల్లి కాబోతున్నట్టు ఏప్రిల్ 11న తన భర్త పుట్టిన రోజు సందర్భంగా ప్రెగ్నెన్సీని బయట పెట్టింది.

36

అప్పటి నుంచి తన ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది ప్రణీత. తన బేబీని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు, ఈజీ డెలీవరీకి సంబంధించిన కొన్ని ప్రెగ్నెన్సీ ఎక్సర్ సైజ్ లు చేస్తూ, పౌష్టికాహారం తీసుకుంటూ కనిపిస్తూనే ఉంది. తన బేబీ బంప్ ఫొటోలనూ కూడా షేర్ చేసుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తోంది బ్యూటీ.

46

ప్రస్తుతం ప్రణీత ప్రెగ్నెన్సీ చివరి దశలో ఉంది. అతి కొద్ద రోజుల్లోనే ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ సందర్బంగా మానసికంగా, శారీరకంగా తనను తాను సిద్ధం  చేసుకుంటోంది. ప్రణీత. తాజాగా తన బేబీ బంప్ కు సంబంధించిన ఫొటోషూట్ చేసిందది. ఆ పిక్స్ ను  అభిమానులతో పంచుకుంది.
 

56

ఇన్ స్టా గ్రామ్ ద్వారా లేటెస్ట్ బేబీ బంప్ పిక్స్ ను పంచుకున్న ప్రణీత .. హార్ట్ ఫెల్ట్ నోట్ రాసింది. తన ప్రెగ్నెన్సీ జర్నీలో ఎలాంటి అనుభూతిని కలిస్తుందో తెలియజేసింది. తాజా ఫొటోషూట్ ద్వారా ఆ అనుభూతిని వివరించే ప్రయత్నం చేసింది. 
 

66

నోట్ లో.. ‘ప్రస్తుతానికి చివరి దశ, ప్రెగ్నెన్సీలో ప్రతి పౌండ్ బరువు, ప్రతి సాగిన గుర్తు, నా గుమ్మడికాయ ముఖం, పెద్ద ముక్కు, ఆ కటి నొప్పి. గుండె బరువెక్కిపోవడం, అలసటగా ఉండటం వంటివి విలువైనవి నాకు నేను చెప్పుకుంటున్నాను’ అని ఎమోషనల్ గా పేర్కొంది. 

click me!

Recommended Stories