Samantha Ruth Prabhu: డెలివరీ డేట్‌పై సమంత క్రేజీ పోస్ట్.. రాజ్ నిడిమోరుతో స్పెషల్ పూజ, ఫోటోలు వైరల్‌

Published : Nov 18, 2026, 04:24 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తొమ్మిదో నెల గర్భంతో ఉన్నారు. డెలివరీ డేట్ దగ్గరపడుతుండటంతో సోషల్ మీడియాలో ఓ ఫన్నీ మీమ్ షేర్ చేశారు. మరోవైపు భర్త రాజ్ నిడిమోరుతో కలిసి ఇంట్లో ప్రత్యేక పూజలు చేసిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

PREV
16
డెలివరీ కోసం వెయిట్‌ చేస్తోన్న సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రెగ్నెంట్‌ అయిన ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంలో అత్యంత మధురమైన క్షణాలను ఎంజాయ్ చేస్తున్నారు. తల్లి కాబోతున్న ఆనందంలో ఉన్న ఆమె ఇప్పుడు తొమ్మిదో నెల గర్భవతి. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంత, తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. తాజాగా తన డెలివరీ డేట్‌ గురించి ఆమె షేర్ చేసిన ఫన్నీ పోస్ట్, భర్తతో కలిసి చేసిన ప్రత్యేక పూజల ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.

26
డెలివరీపై సమంత క్రేజీ పోస్ట్

సమంత లేటెస్ట్ గా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫన్నీ మీమ్ షేర్ చేశారు. అందులో ఓ గర్భిణీ ఆనందంగా స్నాక్స్ తింటున్న వీడియో ఉంది. దానికి `ఈ వారం మీ ప్లాన్స్ ఏంటి?` అని రాసి ఉంది. దానికి సమాధానంగా సోమవారం నుంచి ఆదివారం వరకు ప్రతి రోజూ `బహుశా బిడ్డకు జన్మనివ్వొచ్చు` అని ఫన్నీగా రిప్లై ఇచ్చారు. ప్రెగ్నెన్సీ చివరి రోజుల్లో ఉండే ఉత్సాహాన్ని, ఎదురుచూపులను ఈ క్రేజీ మీమ్ ద్వారా సమంత చెప్పకనే చెప్పారు. ఇది చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

36
గ్రాండ్‌గా జరిగిన స్పెషల్ పూజ

'మా ఇంటి బంగారం' సినిమా సక్సెస్ మీట్ స్టేజ్‌పై సమంత తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తన ప్రెగ్నెన్సీ జర్నీలోని స్పెషల్ మూమెంట్స్‌ను అభిమానులు పంచుకుంటున్నారు. మరీ ముఖ్యంగా తొమ్మిదో నెలలో కూడా ఫిట్‌నెస్‌ను మెయింటైన్ చేస్తూ, వర్కౌట్స్, వెయిటెడ్ స్క్వాట్స్ చేస్తున్న వీడియోలు పోస్ట్ చేసి నెటిజన్లను ఆశ్చర్యపరిచారు. గర్భవతిగా ఉన్న సమయంలో శారీరకంగా యాక్టివ్‌గా ఉండటం ఎంత అవసరమో ఆమె తన పోస్ట్‌ల ద్వారా చెబుతున్నారు.

46
సమంత ఇంట్లో ప్రత్యేక పూజలు

ఇక సమంత తన భర్త రాజ్ నిడిమోరు, కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే చాలా గ్రాండ్‌గా ఓ ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో సమంత ఎరుపు రంగు కుర్తా సెట్ ధరించి ఎంతో ప్రశాంతంగా, అందంగా కనిపించారు. ఈ డ్రెస్ 'ఓగాన్' (Ogaan) బ్రాండ్‌కు చెందినది కాగా, దీని ధర సుమారు 48,562 రూపాయలు ఉంటుందని సమాచారం. కాటన్ సిల్క్‌తో తయారు చేసిన ఈ డ్రెస్ అంచులకు బ్రోకేడ్ టిష్యూతో డిజైన్ చేశారు.

56
మధుర క్షణాలను ఆస్వాధిస్తోన్న సమంత

ప్రస్తుతం సమంత డెలివరీ డేట్ మీమ్, పూజా కార్యక్రమం ఫోటోలు నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. తమ ఫేవరెట్ హీరోయిన్, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని అభిమానులు కామెంట్ల రూపంలో ఆకాంక్షిస్తున్నారు. మొత్తానికి ఈ మాతృత్వపు మధుర ప్రయాణాన్ని సమంత అస్వాధిస్తోంది.

66
గుడ్‌ న్యూస్‌ కోసం అభిమానుల ఎదురుచూపు

సమంత పోస్ట్ చేసిన "ఈ వారమే బిడ్డకు జన్మనివ్వొచ్చు" అనే మీమ్ చూసి అభిమానులు తెగ ఎగ్జైట్ అవుతున్నారు. ఏ క్షణమైనా గుడ్ న్యూస్ వినొచ్చని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఆ గుడ్‌న్యూస్‌ ఎప్పుడు చెబుతుందో చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories