Pawan Kalyan: ప్రేమించిన అమ్మాయి, పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి ఇద్దరూ దూరం.. 30 సార్లు రిజెక్ట్ చేసిన పవన్

Published : Nov 18, 2026, 03:47 PM IST

పవన్ కళ్యాణ్, సిరివెన్నెల మధ్య ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. బద్రి సినిమా కోసం సిరివెన్నెల రాసిన ఓ పాటని పవన్ 30 సార్లు రిజెక్ట్ చేశారట. అసలేం జరిగింది, పవన్ ఎందుకు రిజెక్ట్ చేశారు అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

PREV
15
Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ బిగినింగ్ లో ఎక్కువగా ప్రేమ కథా చిత్రాలే చేశారు. సుస్వాగతం, తొలిప్రేమ ఇలాంటి సినిమాలతో విజయాలు అందుకున్న తర్వాత తమ్ముడు మూవీ వచ్చింది. అది కూడా సూపర్ హిట్ అయింది. ఆ టైంలో పవన్ కళ్యాణ్ కి కథ చెప్పి ఒప్పించిన పూరి జగన్నాధ్ తొలిసారి దర్శకత్వం వహించే ఛాన్స్ అందుకున్నారు. ఆ సినిమానే బద్రి.

25
హీరోయిన్లుగా రేణు దేశాయ్, అమీషా పటేల్

ఈ మూవీలో రేణు దేశాయ్, అమీషా పటేల్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో వేటూరి నాలుగు పాటలు, చంద్రబోస్ ఒక పాట రాశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా ఒక సాంగ్ రాయాల్సి ఉంది. దర్శకుడు, సంగీత దర్శకుడు సందర్భం చెప్పారు. అప్పటికే సినిమా చివరి దశకు చేరుకుంది. కొన్ని సాంగ్స్ చిత్రీకరణ కోసం పూరి, పవన్ అండ్ టీం ఆఫ్రికాకి వెళ్లారు.

35
ఒక్క పాటని 30 సార్లు రిజెక్ట్ చేసిన పవన్

సిరివెన్నెల సందర్భానికి తగినట్లుగా పాట రాస్తున్నారు. కానీ పవన్ కి నచ్చడం లేదు. దీనితో వెర్షన్లు మారుస్తూ సిరివెన్నెల రాస్తూనే ఉన్నారు. అలా పవన్ కళ్యాణ్ మొత్తం 30 సార్లు సిరివెన్నెల రాసిన సాంగ్ ని రిజెక్ట్ చేసినట్లు ప్రముఖ రచయిత చిల్లగట్టు శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీనితో సిరివెన్నెల ఒకసారి పవన్ ని కలిసి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం అనుకున్నారట.

45
సందర్భం ఏంటంటే

పవన్ ఆఫ్రికా నుంచి రాగానే సిరివెన్నెల పవన్ ని వెళ్లి కలిశారు. అసలు ఇంతకీ ఆ పాట సందర్భం ఏంటంటే.. బద్రి ప్రీ క్లైమాక్స్ కి ముందు రావాల్సిన సాంగ్ అది. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ఇద్దరికీ అప్పటికే పెళ్లి కుదిరింది. ఇంతలో పవన్, అమీషా పటేల్ మధ్య ప్రేమ మొదలవుతుంది. కథ చివరికి వచ్చేసరికి ఇటు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి, అటు ప్రేమించిన అమ్మాయి ఇద్దరూ పవన్ కి దూరమయ్యే పరిస్థితి వస్తుంది. అదీ సందర్భం.. దానికి తగినట్లుగా పాట ఉండాలి.

55
పవన్ కళ్యాణ్ చెప్పిన మాటకు సిరివెన్నెల ఫిదా

సిరివెన్నెల తన సాహిత్య జ్ఞానాన్ని ఉపయోగించి అన్ని అంశాలు స్పృశిస్తూ, విధి రాత అనే కోణంలో కూడా పాట రాశారు. అయినా కూడా పవన్ కి నచ్చలేదు. ఇన్నిసార్లు ఈ పాటని ఎందుకు రిజెక్ట్ చేశారు అని సిరివెన్నెల పవన్ ని అడగగా.. పవన్ ఇచ్చిన ఆన్సర్ సిరివెన్నెలని ఆశ్చర్యపరిచినట్లు చిల్లగట్టు శ్రీకాంత్ పేర్కొన్నారు. విధిరాత కన్నా పైస్థాయి లో ఈ సాంగ్ ఉండాలి. మీరు ఆ విధంగా రాస్తారు అని ఆశించా అని పవన్ అన్నారట. విధిరాత కన్నా పైస్థాయి ఏంటి అని సిరివెన్నెల అడిగితే.. కర్మ స్వేచ్ఛ అని పవన్ కళ్యాణ్ బదులిచ్చారు. అప్పట్లోనే పవన్ కి సాహిత్యం పట్ల ఉన్న అవగాహన చూసి సిరివెన్నెల ఆశ్చర్యపోయారట. ఆ తర్వాత సిరివెన్నెల కాకుండా ఆ పాటని వేటూరి పూర్తి చేశారు. ప్రీ క్లైమాక్స్ లో 'వరమంటి మనసే' అంటూ ఎమోషనల్ గా వచ్చే పాట అది.

Read more Photos on
click me!

Recommended Stories