సమంత ఫిట్‌నెస్‌ వీడియోపై నందినిరెడ్డి సెటైర్‌.. స్టార్‌ హీరోయిన్ షాకింగ్‌ రియాక్షన్‌.. పేలుతున్న జోకులు

Published : Jan 26, 2023, 06:22 PM IST

సమంత అనారోగ్యం నుంచి కోలుకుంటోంది. మళ్లీ పూర్వ స్థితికి వచ్చేందుకు శ్రమిస్తుంది. జిమ్‌లో చెమటోడుస్తుంది. తాజాగా ఆమె వీడియో షేర్‌ చేయగా, అందుకు దర్శకురాలు నందిని రెడ్డి రియాక్ట్ కావడం ఇప్పుడు రచ్చ అవుతుంది.   

PREV
17
సమంత ఫిట్‌నెస్‌ వీడియోపై నందినిరెడ్డి సెటైర్‌.. స్టార్‌ హీరోయిన్ షాకింగ్‌ రియాక్షన్‌.. పేలుతున్న జోకులు

సమంత ఇటీవల మళ్లీ యాక్టివ్‌ అవుతుంది. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. చాలా వరకు ఆమె వర్కౌట్‌ పిక్స్ ని, వీడియోలను పంచుకుంటుంది. అందులో భాగంగానే గురువారం జిమ్‌లో శ్రమిస్తున్న వీడియోని షేర్‌ చేసింది.  ఇన్‌ స్టాగ్రామ్‌ వేదికగా సామ్‌ ఈ వీడియోని షేర్‌ చేయగా, అది వైరల్‌ అవుతుంది. 
 

27

ఇందులో తన ఫిట్‌నెస్‌ని చూపిస్తుంది సమంత. మేల్స్ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఆమె వర్కౌట్‌ చేస్తుండటం విశేషం. మయో సైటిస్‌ వ్యాధి కారణంగా కోల్పోయిన శక్తిని తిరిగి కూడగట్టుకునేందుకు తన ఫిట్‌నెస్‌ని పెంచుకునేందుకు సమంత కష్టపడుతుంది. కఠినమైన వర్కౌట్స్ చేస్తూ చెమటోడుస్తుంది. తాజాగా పంచుకున్ని వీడియోలో ఆమె కష్టం, దాని వెనకాల కమిట్‌మెంట్‌, కసి కనిపిస్తున్నాయి. 

37

ఈ వీడియోని షేర్‌ చేస్తూ, `లావుగా ఉన్న మహిళలకు ఇది ముగియదు, క్లిష్టమైన సమయంలో నాకు చేరువై, నన్ను ఇన్ స్పైర్‌ చేసిన గ్రావిటీ మ్యూజీషియన్‌ బ్రాండ్‌కి ధన్యవాదాలు.  సాధ్యమైనంత వరకు కఠినమైన డైట్‌లో ఉండటం వల్ల మనం తిన్న ఆహారం వల్లే బలం రాదని, మన ఆలోచిస్తారో విధానం పైనా ఆది ఆధారపడి ఉంటుందని నా అభిప్రాయం` అని చెప్పింది సమంత. ఇందులో తన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ జునైద్‌ని ట్యాగ్‌ చేయడం విశేషం. దీంతో సమంత పోస్ట్ వైరల్‌ అవుతుంది. 
 

47

దీనిపై దర్శకురాలు నందిని రెడ్డి స్పందించారు. సమంత రెండు చేతులతో వర్కౌట్స్ చేస్తుండగా, తాను మాత్రం ఒక్క చేత్తోనే చేశానని చెప్పారు. నువ్వు ఫీల్‌ అవుతావనే కారణంతో ఆ వీడియోని పోస్ట్ చేయలేదని ఫన్నీగా పోస్ట్ చేసింది నందిని రెడ్డి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ సెటైర్లు, జోకులు పేలుస్తున్నారు. ఇదిలా ఉంటే సమంత, నందినిరెడ్డి కాంబినేషన్‌లో `ఓ బేబీ` చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. 

57

దీనికి సమంత కూడా రియాక్ట్ అయ్యింది. అదిరిపోయే పోస్ట్ పెట్టింది. మీ దయకి ధన్యవాదాలు అంటూ ముతి తిప్పిన ఎమోజీని పంచుకుంది. ఇది మరింత ఆకట్టుకోవడంతోపాటు వైరల్‌గా మారింది. సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అవుతుంది. ఇక నందినిరెడ్డి పోస్ట్ రాహుల్‌ రవీంద్రన్‌ రియాక్ట్ అవుతూ, తాను సింగిల్‌ వేలితో చేస్తానని చెప్పడం విశేషం. 

67

సమంత.. నాగచైతన్యతో విడాకుల తర్వాత బాగా స్ట్రగుల్ అయిన విషయం తెలిసిందే. దాన్నుంచి తేరుకునే సమయంలోనే మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధి ఎటాక్‌ చేసింది. కండరాలకు సంబంధించిన ఈ వ్యాధితో దాదాపు నాలుగైదు నెలలు పోరాడింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. దాన్నుంచి బయటపడేందుకు వర్కౌట్స్ చేస్తుంది సమంత. 

77

ఇక గతేడాది `యశోద` చిత్రంతో అలరించింది సమంత. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రంగా రూపొందిన ఆ సినిమా ఘన విజయం సాధించింది. ఇప్పుడు సమంత `శాకుంతలం`లో నటించింది. ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కాబోతుంది. ఈచిత్ర ప్రమోషన్‌ కోసం ఆమె మీడియా ముందుకు కూడా వచ్చింది. ఇకపై ఆమె రెగ్యూలర్‌గా తాను కమిట్‌ అయిన సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతుంది. సమంత `ఖుషి`లో విజయ్‌ దేవరకొండతో నటించాల్సి ఉంది. అలాగే బాలీవుడ్‌లోనూ రెండు మూడు సినిమాలకు కమిట్‌ అయ్యింది. ఓ ఇంగ్లీష్‌ మూవీ కూడా సమంత చేయాల్సి ఉంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories