Samantha Baby Bump: ఫస్ట్ టైమ్‌ బేబీ బంప్‌ చూపించిన సమంత, ఫన్నీ పోస్ట్.. డెలివరీ ఎప్పుడంటే

Published : Nov 10, 2026, 08:56 AM IST

సమంత ప్రస్తుతం ప్రెగ్నెంట్‌తో ఉన్నారు. ఆమె `మా ఇంటి బంగారం` సమయంలోనే ప్రెగ్నెంట్‌. తాజాగా ఆమె మొదటిసారి తన బేబీ బంప్‌ని ఓపెన్‌గా చూపించారు. డెలివరీపై హింట్‌ ఇచ్చారు.

PREV
14
ప్రెగ్నెంట్‌తో ఉన్న సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైన దశను ఆస్వాదిస్తున్నారు. తల్లి కాబోతున్న ఆనందంలో ఉన్న ఈ అందాల భామ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన బేబీ బంప్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా చాలా సాధారణంగా తీసుకున్న ఈ ఫోటో అభిమానులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సమంత పెట్టిన క్యాప్షన్ నెటిజన్లను నవ్విస్తోంది.

24
సాధారణ ఫోటోతో మ్యాటర్నిటీ షూట్..

సమంత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను షేర్ చేసింది. ఇందులో ఆమె సోఫాపై హాయిగా కూర్చొని, తన బేబీ బంప్‌ను చేతులతో పట్టుకుని కనిపించింది. రెడ్ కలర్ ప్రింటెడ్ టాప్, వైట్ కలర్ ప్యాంట్ ధరించిన సమంత.. కళ్లకు సన్‌గ్లాసెస్ పెట్టుకుని రిలాక్స్‌డ్ లుక్‌లో కనిపించింది. సాధారణంగా సెలబ్రిటీలు మ్యాటర్నిటీ ఫోటోషూట్ కోసం ప్రత్యేకమైన దుస్తులు, అందమైన లొకేషన్లు, భారీ సెటప్‌లను ఎంచుకుంటారు. కానీ సమంత మాత్రం చాలా సింపుల్‌గా తన ఫోటోను షేర్ చేసింది.

ఈ ఫోటోకు “Consider this my maternity shoot” (దీనినే నా మ్యాటర్నిటీ షూట్‌గా భావించండి) అంటూ సరదాగా క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఒక్క మాటతో తన ప్రత్యేకమైన ఫోటోషూట్‌ను అభిమానులకు పరిచయం చేసింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు సమంత స్టైల్‌ను ప్రశంసిస్తున్నారు.

34
రాజ్ నిడిమోరుతో కొత్త జీవితంలోకి..

సమంత, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు 2025 డిసెంబర్ 1న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. వీరిద్దరూ కలిసి గతంలో ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్: హనీ బన్నీ’ వంటి ప్రాజెక్టులకు పనిచేశారు. ఇప్పుడు తమ జీవితంలోకి కొత్త అతిథిని ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్నారు.

2026 జూన్‌లో ‘మా ఇంటి బంగారం’ సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా సమంత తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. త్వరలో మాతృత్వాన్ని ఆస్వాదించబోతున్నానని, తన ప్రస్తుత సినిమా కమిట్‌మెంట్స్ పూర్తయ్యాక కొంతకాలం సినిమాలకు విరామం తీసుకుంటానని కూడా తెలిపారు.

44
అభిమానుల్లో ఆనందం..

సమంత తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటారు. అయితే ప్రస్తుతం ఆమె షేర్ చేస్తున్న బేబీ బంప్ ఫోటోలు అభిమానులకు ఆకట్టుకుంటోంది. దీంతో వాళ్లు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే సమంత పోస్ట్ ని బట్టి ఆమెకి చివరి నెలల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె వచ్చే నెలలో డెలివరీ అయ్యే అవకాశం ఉందని సమాచారం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories