Pawan Kalyan: 13 ఏళ్ల బంధానికి ముగింపు.. పవన్ కల్యాణ్ - అన్నా లెజినోవా విడాకులు

Published : Nov 10, 2026, 08:10 AM IST

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. మూడో సారి ఆయన తన వివాహజీవితానికి ముగింపు పలికారు. అన్నా లెజినోవాతో విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రకటించారు. ఇద్దరు కలిసి పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించారు.

PREV
14
పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన సతీమణి అన్నా కొణిదెలతో (అన్నా లెజినోవా) కలిసి తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దాదాపు 13 సంవత్సరాల పాటు సాగిన తమ వివాహ జీవితం నుంచి పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ఇద్దరూ సంయుక్తంగా వెల్లడించారు. ఈ నిర్ణయం టాలీవుడ్ సినీ వర్గాలతో పాటు రాజకీయాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

24
సంయుక్త ప్రకటనలో స్పష్టత

తమ విడాకుల విషయమై పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. జీవితంలో ఎంతో సుదీర్ఘమైన కాలాన్ని తాము ఇద్దరం కలిసి సంతోషంగా గడిపామని, అయితే కాలక్రమేణా వచ్చిన మార్పుల కారణంగా పరస్పర గౌరవంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఈ బంధం ముగిసినప్పటికీ, తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎప్పుడూ మంచి స్నేహితులుగా, బాధ్యత గల తల్లిదండ్రులుగా కొనసాగుతామని స్పష్టం చేశారు. పిల్లల సంక్షేమం, సంతోషమే తమకు ముఖ్యమని వెల్లడించారు.

34
పరిచయం నుంచి వివాహం వరకు..

పవన్ కల్యాణ్, అన్నా లెజ్నెవా పరిచయం వెనుక సినిమా బ్యాగ్రౌండ్ ఉంది. 2011లో వచ్చిన 'తీన్ మార్' చిత్ర షూటింగ్ సమయంలో వీరికి తొలిసారి పరిచయం ఏర్పడింది. రష్యాకు చెందిన అన్నా లెజినోవాతో సినిమా షూటింగ్ సమయంలో మొదలైన సాన్నిహిత్యం క్రమంగా ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో 2013 సెప్టెంబర్‌లో వీరు ఒక్కటయ్యారు. వివాహానంతరం అన్నా కొణిదెల ప్రధానంగా కుటుంబ బాధ్యతలపైనే దృష్టి పెట్టారు. పవన్ కల్యాణ్ రాజకీయంగా, సినీ రంగంలో బిజీగా ఉన్న సమయంలో కుటుంబానికి అండగా నిలిచారు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం ఉన్నారు. కుమార్తె పొలెనా అంజనా పవనోవా, కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌.

44
గోప్యతకు గౌరవం ఇవ్వాలని విజ్ఞప్తి

ఈ వ్యక్తిగత నిర్ణయం తీసుకున్న తరుణంలో మీడియా, అభిమానులు, శ్రేయోభిలాషులు తమ గోప్యతను గౌరవించాలని వారు కోరారు. తమ ప్రయాణంలో ఇన్నాళ్లు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. విడాకులకు దారితీసిన కచ్చితమైన కారణాలపై ఎలాంటి వివరాలను బయటపెట్టలేదు. చట్టపరమైన ప్రక్రియలను పరస్పర అవగాహనతో పూర్తి చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ పరిణామం తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. విచారం వ్యక్తం చేస్తూనే, ఇద్దరి నిర్ణయాన్ని గౌరవించాలని కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయంతో ముందు ముందు ఎన్నివిమర్శలు ఫేస్ చేస్తారో చూడాలి. గతంలో మూడు పెళ్లిల్ల గురించి విమర్శలు చేసిన వారు.. ఈ సారి ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories