ఇటీవల సమంతా ఒక యువకుడితో చేతులు కలిపి నడుస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఒక పెళ్లిలో ఆ వ్యక్తితో సమంతా బయటకు వస్తున్న వీడియో వైరల్ అయ్యింది. అతను సమంతా కొత్త ప్రియుడు అని, అతను ఎవరో తెలియదంటూ వార్తలు వైరల్ అయ్యాయి.
దర్శిని సూర్య అనే వ్యక్తి ఈ విషయంపై వివరణ ఇచ్చారు. అతను సమంతా స్నేహితుడని చెప్తున్నారు. ఆ వ్యక్తికి ఇప్పటికే పెళ్లయిందని, అతను సమంతకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అని, చాలా ఏళ్లుగా వారిద్దరికీ మంచి స్నేహం ఉందని చెప్పారు. అతని ఇంటి ఫంక్షన్‌కి వెళ్లి సమంతా తిరిగి వస్తున్నప్పుడు తీసిన వీడియో అని చెప్పారు.