ప్రభాస్‌ పెళ్లిపై గుడ్‌ న్యూస్‌ చెప్పిన పెద్దమ్మ, ఇకపై వరుసగా సెలబ్రేషన్సే.. ఈ బర్త్ డే చాలా స్పెషల్‌

First Published | Oct 22, 2024, 5:56 PM IST

ప్రభాస్‌ పెళ్లి అనేది పెద్ద మిస్టరీగా మారింది. ఈ నేపథ్యంలో మరోసారి డార్లింగ్‌ మ్యారేజ్‌పై పెద్దమ్మ శ్యామలా దేవి స్పందించింది. ఇక వచ్చేవన్నీ సెలబ్రేషన్సే అంటూ హింట్‌ ఇచ్చింది. 
 

డార్లింగ్‌ ప్రభాస్‌ పెళ్లి అనేది పెద్ద మిస్టరీగా సాగుతుంది. ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో క్లారిటీ లేదు. ఇదిగో పెళ్లి, అదిగో పెళ్లి అనేలానే వ్యవహారం నడుస్తుంది. కానీ ప్రభాస్‌ నుంచి దీనిపై క్లారిటీ లేదు. మొన్నటి వరకు పెదనాన్న కృష్ణంరాజు స్పందించేవారు. చూస్తున్నామని, చేస్తామని చెబుతూ వచ్చేవారు. ఆ ప్రయత్నాల్లోనే ఉన్నామనే వారు. ఆయన చనిపోయారు, ఇప్పుడు పెద్దమ్మ శ్యామలాదేవి వంతు వచ్చింది. ఆమెకి ఈ ప్రశ్నలు తరచూ ఎదురవుతున్నాయి. ఆమె కూడా అలానే చెబుతూ వస్తుంది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

Prabhas

తాజాగా మరోసారి ప్రభాస్‌ పెళ్లిపై స్పందించింది శ్యామలాదేవి. ప్రభాస్‌ పెళ్లి ఎప్పుడు ఉండబోతుందో అనేది ఆమె వెల్లడించే ప్రయత్నం చేసింది. ఆమె ఓ యూట్యూబ్‌ ఛానెల్‌తో చిట్‌ చాట్‌లో డార్లింగ్‌ పెళ్లిపై రియాక్ట్ అయ్యింది. మ్యారేజ్‌ చేస్తామని, చేయాలని తనకు కూడా ఉందని, ఆ శుభ గడియలు కచ్చితంగా వస్తాయని తెలిపింది.

ఎప్పుడు ఉంటుందనే ప్రశ్నకి ఆమె స్పందిస్తూ, `కల్కి 2898 ఏడీ` సినిమా వచ్చి పెద్ద హిట్‌ అయ్యింది. ఆ సక్సెస్‌ని మనం అందరం ఆస్వాధిస్తూనే ఉన్నాం. ఆ విజయ పరంపర సాగుతూనే ఉంటుంది. ఇకపై అన్నీ ఆనందాలే అని తెలిపింది శ్యామలా దేవి. 
 


అయితే పెళ్లి ఉంటుందని, రాబోయేవన్నీ మంచి రోజులే అని, ఆనందాలే అని చెప్పింది. కానీ పెళ్లి ఎప్పుడు ఉంటుందనేది మాత్రం కచ్చితంగా చెప్పలేకపోయింది. కాకపోతే ప్రభాస్‌ మ్యారేజ్‌పై ఆమె మాటలు కొంత హోప్‌ ఇచ్చేలా ఉన్నాయి. పెళ్లి ఉండబోతుందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మరి నిజంగానే ఉంటుందా? ఆ విషయంలో కొంతైనా ముందడుగు పడుతుందా? అనేది చూడాలి.

ఈ శుభవార్త కోసం మాత్రం ఫ్యాన్స్ ఎంతో మంది ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. అయితే తన పెళ్లిపై ప్రభాస్‌ ఆ మధ్య స్పందిస్తూ, ఆయన పెళ్లి చేసుకుంటే చాలా మంది అమ్మాయిలు హర్ట్ అవుతారని, అందుకే పెళ్లి చేసుకోవడం లేదని, సినిమాలు చేస్తున్నానని తెలిపారు. మ్యారేజ్‌పై ఆయన కూడా ఆ సస్పెన్స్ ని అలానే ఉంచేశారు. ఇప్పుడు వరుస సక్సెస్‌లో ఉన్న ప్రభాస్‌ ఇకపై అయినా మ్యారేజ్‌ గురించి ఆలోచిస్తారా? అనేది చూడాలి. 

Prabhas

`బాహుబలి` తర్వాత నుంచి ప్రభాస్ వరుసగా రెండు మూడు పరాజయాలు చవిచూశారు. `సాహో` ఆడలేదు. `రాధేశ్యామ్‌` డిజాస్టర్‌ అయ్యింది. `ఆదిపురుష్‌` సైతం అదే బాటలో ఉంది. అనంతరం గతేడాది చివరల్లో `సలార్‌`తో వచ్చి పెద్ద హిట్‌ అందుకున్నారు. ఇటీవల `కల్కి 2898 ఏడీ`తో మరో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ని అందుకున్నారు. ఇలా విజయ పరంపర కొనసాగిస్తున్నారు. ఫ్యాన్స్ అంతా ఖుషీ అవుతున్నారు.

ఇక ప్రస్తుతం `ది రాజా సాబ్‌`, హను రాఘవపూడి సినిమాలు చేస్తున్నారు ప్రభాస్‌. నెక్ట్స్ `స్పిరిట్‌`, `సలార్‌ 2`, `కల్కి 2` సినిమాలు చేయాల్సి ఉంది. ఇలా మరో రెండు మూడేళ్లు ఆయన బిజీగా ఉండబోతున్నారు. ఈ క్రమంలో మ్యారేజ్‌ ఎప్పుడు చేసుకుంటాడనేది డౌట్‌. ఈ లెక్కన మరో రెండు మూడేళ్లు పెళ్లి మాటే లేదని చెప్పొచ్చు. 

ఇక రేపు 45వ బర్త్ డే చేసుకుంటున్నారు ప్రభాస్‌. ఈ సారి ఆయన బర్త్ డే చాలా స్పెషల్‌గా ఉండబోతుంది. వరుస సక్సెస్‌ ల నేపథ్యంలో వస్తున్న బర్త్ డే కావడంతో డార్లింగ్‌తోపాటు ఆయన ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. దీంతో చాలా స్పెషల్‌గా ప్లాన్‌ చేస్తున్నారట. ఫ్యాన్స్ భారీగా బర్త్ డే సెలబ్రేషన్స్ చేయబోతున్నారు. అదే సమయంలో ఆయన సినిమాలకు సంబంధించిన సర్‌ప్రైజ్‌లు రాబోతున్నాయి.

`ది రాజా సాబ్‌` టీజర్‌ రాబోతుందని తెలుస్తుంది. అలాగే హను రాఘవపూడి సినిమాకి సంబంధించిన అప్‌ డేట్‌ రాబోతుందట. దీంతోపాటు `స్పిరిట్‌` సినిమాకి సంబంధించిన ప్రకటన కూడా ఉంటుందని సమాచారం. ఇలా వరుసగా కొత్త సినిమాలతో సర్‌ప్రైజ్‌లు ఇవ్వబోతున్నారు డార్లింగ్‌. ఈ బర్త్ డే ని చాలా స్పెషల్‌గా మార్చబోతున్నారు. 

read more: మహేష్‌ సినిమాలో హైలైట్స్ అవే, రాజమౌళి భారీ ప్లాన్‌..? చిన్నపిల్లాడు నుంచి, గ్లోబల్‌ ఆడియెన్స్ వరకు

Also read: టాక్ షోలో ప్రభాస్, ఎప్పుడు, ఎక్కడ, పూర్తి డిటేల్స్

Latest Videos

click me!