టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండియా మొత్తం ఈ ముద్దుగుమ్మకు అభిమానులు ఉన్నారు. బడా హీరోల సరసన నటించి తన కంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది.
సామ్ కు గట్టి ఫ్యాన్ ఫాలోయింగే ఉంటుంది. ఆమెను అభిమానించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంటుంది. ఇక సమంత కూడా తన గురించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటుంది.
ఇప్పటికే తను ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు గతంలో చెప్పిన విషయం తెలిసిందే. దాని నుంచి పూర్తి కోలుకునేందుకు ఏడాది పాటు సినిమాలకు కూడా దూరంగా ఉంటున్నట్టు ప్రకటించింది. ఈ సమయంలో ఫ్యాన్స్ కోసం ఇంట్రెస్టింగ్ గా పోస్టులు పెడుతూ వస్తోంది.
తాజాగా తన బాల్యాన్ని గుర్తు చేసుకుంది. తన చిన్నప్పుడు అకాడమిక్ సెలబస్ కు సంబంధించిన పుస్తకాల కంటే... ఇతర పుస్తకాలనే ఎక్కువగా చదివేదంట సామ్. మళ్లీ ఇప్పుడు అదే పనిలో ఉన్నట్టు చెప్పింది. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ గా క్యాప్షన్ ఇచ్చింది.
‘నేను చిన్నప్పుడు మా సిలబస్‌కి మించిన పుస్తకాలు చదువుతాను. ఏ సబ్జెక్ట్‌లో అయినా పరిశోధన చేయడం, లీనమవడం నాకు చాలా ఇష్టం. ఇప్పుడు, నేను మళ్లీ చదువుతున్నాను. చాలా సంవత్సరాల తర్వాత నా మనసు ఉప్పొంగుతోంది.. నా నోట్‌బుక్‌లు నిండాయి.. త్వరలోనే మీతో పంచుకుంటాను.’ అంటూ రాసుకొచ్చింది.
అయితే సామ్ త్వరలోనే తన హెల్త్ పాడ్ కాస్ట్ తో ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేయబోతోంది. వారంలోగా వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య సూత్రాలు, నియమాలు, హెల్త్ పై అవగాహన కల్పించేందుకు ఈ పాడ్ కాస్ట్ ఉపయోగపడుతుందని తెలుస్తోంది. ఇక సామ్ నెక్ట్స్ ‘సిటాడెల్’తో అలరించనుంది.