సమంత సాహసం, కఠినమైన ఛాలెంజ్ ను సులువుగా పూర్తి చేసిన స్టార్ హీరోయిన్

Published : Jan 23, 2026, 05:09 PM IST

జీవితంలో ఫేస్ చేసిన కష్టాలతో రాటుదేలిన సమంత.. కఠినమైన ఛాలెంజ్ లను ఎన్నో సూలువుగా పూర్తి చేస్తోంది. రీసెంట్ గా సమంత చేసిన సాహసం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

PREV
15
జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూసిన సమంత..

హీరోయిన్ గా స్టార్ డమ్ ను చూసిన సమంత.. పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎన్నో కష్టాలను అనుభవించింది. టాలీవుడ్ హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె.. మూడేళ్లకే గొడవల వల్ల విడాకులు తీసుకుంది. ఏడేళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వీరు.. ముచ్చటగా మూడేళ్లు కూడా కలిసి బ్రతకలేకపోయారు. వీరి విడాకులు అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చాయి. ఇక విడాకులు తరువాతసమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో చాా బాధపడింది. ఆ సమయంలో ఆమె శారీరకంగా, మానసికంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, ధైర్యంగా ఆ పరిస్థితులను ఎదుర్కొని మళ్లీ లైఫ్ ను కొత్తగా స్టార్ట్ చేసింది.

25
సమంత రెండో పెళ్లి..

విడాకుల తరువాత నాగచైతన్య హీరోయిన్ శోభితను రెండో పెళ్లి చేసుకోగా.. నాగచైతన్య పెళ్లి చేసుకున్న ఏడాది తరువాత సమంత బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు‌ను పెళ్లాడింది. రాజ్ తో సమంత ప్రేమలో ఉందంటూ చాలా కాలంగా వార్తలు వైరల్ అవుతూ వచ్చాయి. వాటిని నిజం చేస్తూ.. గత ఏడాది డిసెంబర్ 1న కోయంబత్తూర్‌లోని ఈషా యోగా సెంటర్ సమీపంలోని లింగ భైరవి ఆలయం వద్ద భూతశుద్ధి పద్ధతిలో ఈ ఇద్దరు స్టార్లు పెళ్లి చేసుకున్నారు.

35
సినిమాలు, వ్యాపారాలతో సమంత బిజీ..

పెళ్లి తరువాత సమంత మరింత బిజీగా మారింది. ఒకవైపు సినిమా నిర్మాణం,నటన, వ్యాపార రంగంలో ఎంతో బిజీగా ఉంటోంది శ్యామ్. పలు బ్రాండ్లను కూడా సమంత ప్రారంభించగా... అవి మంచి లాభాల్లో నడుస్తున్నట్టు తెలుస్తోంది. ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే సొంత నిర్మాణ సంస్థను ఆమె స్టార్ట్ చేసింది. ఈ బ్యానర్‌పై ఇప్పటికే ఒక సినిమా చేసి హిట్ కొట్టిన సమంత.. రెండో చిత్రంగా మా ఇంటి బంగారం సినిమాను రూపొందిస్తోంది. అంతే కాదు ఈసినిమాలో ఆమె నటిస్తోంది కూడా. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లలో సమంత యాక్షన్ పర్ఫామెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

45
సమంత ఫిట్ నెస్ ఛాలెంజ్..

సమంత సినిమాలు ఒక ఎత్తు అయితే.. ఆమె ఫిట్ నెస్ కూడా ఒక ఎత్తు. జిమ్ లో సమంత చేసే వర్కౌట్లు చూస్తేనే.. చెమటలు పడతాయి. అంత కఠినమైన వ్యాయామాలు కూడా అలవోకగా చేసేస్తుంది సమంత. ఫిట్‌నెస్‌కు చాలా ఇంపార్టెన్స్  ఇస్తుంది సామ్. డైలీ.. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు ప్రేరణగా నిలుస్తోంది. తాజాగా ఆమె ట్రైనర్ ఎమీ వైట్సమంతకు ఒక కఠినమైన ఫిట్‌నెస్ ఛాలెంజ్ విసిరారు.

55
అలవోకగా చేసిన సమంత..

ట్రైనర్ విసిరిన ఛాలెంజ్‌లో భాగంగా సాధారణ పుష్‌అప్స్ కాకుండా, పుష్‌అప్స్ చేస్తూనే ముందుకు–వెనక్కి కదలడం, ఎడమ చేతితో కుడి కాలి మోకాలిని, కుడి చేతితో ఎడమ కాలి మోకాలిని తాకడం, ఈ మొత్తం సమయంలో శరీరం నేలను తాకకుండా బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం వంటి కఠినమైన నియమాలు ఉన్నాయి. వినడానికి కష్టంగా అనిపించే ఈ ఛాలెంజ్‌ను సమంత ఎంతో సులువుగా పూర్తి చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సమంత షేర్ చేసిన ఈ ఫిట్‌నెస్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు షాక్ అవుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories