Anil Ravipudi నెక్ట్స్ సినిమా అప్‌ డేట్‌.. స్టార్స్ తో కాకుండా కుర్ర హీరోతో ప్లాన్‌.. పెద్ద రిస్కే

Published : Jan 23, 2026, 04:37 PM IST

దర్శకుడు అనిల్‌ రావిపూడి నెక్ట్స్ ఎవరితో సినిమా చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఓ యంగ్‌ హీరోతో ప్లాన్‌ చేస్తున్నాడట. పెద్ద రిస్కే చేయబోతున్నాడట. 

PREV
15
మన శంకర వర ప్రసాద్‌ గారుతో బ్లాక్ బస్టర్‌ కొట్టిన అనిల్‌ రావిపూడి

అనిల్‌ రావిపూడి గత సంక్రాంతికి `సంక్రాంతికి వస్తున్నాం` మూవీతో హిట్‌ కొట్టాడు. ఈ సంక్రాంతికి `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీతో మరో బ్లాక్‌ బస్టర్‌ కొట్టాడు. ఈ మూవీ రీజనల్‌ చిత్రాల్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇప్పటికే ఇది మూడు వందల కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. నాలుగు వందల కోట్ల దిశగా అడుగులు వేస్తోంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా సినిమా ఉండటంతో ఫ్యామిలీ ఆడియెన్స్ క్యూ కడుతున్నారు. ఇప్పటికీ సినిమాకి విశేష ఆదరణ లభించడం విశేషం. 

25
అనిల్‌ రావిపూడి నెక్ట్స్ మూవీపై సస్పెన్స్

ఈ క్రమంలో అనిల్‌ రావిపూడి నెక్ట్స్ సినిమా ఎవరితో అనేది ఆసక్తికరంగా మారింది. పవన్‌ కళ్యాణ్‌తో సినిమా ఇప్పట్లో లేదనే విషయాన్ని అనిల్‌ రావిపూడి తెలిపారు. వెంకటేష్‌ తో `సంక్రాంతికి వస్తున్నాం` సీక్వెల్‌ లేదన్నారు. అదే సమయంలో కొత్తగా ఇంకా ఎవరితోనూ అనుకోలేదని తెలిపారు. ఇటీవలే ఒక టైటిల్‌ అనుకున్నాడట. అది చాలా క్రేజీగా ఉంటుందని, ఆడియెన్స్ ఆశ్చర్యపోతారని తెలిపారు. అదిరిపోయేలా ఉంటుందని, ప్రస్తుతం దీనిపై వర్క్ చేస్తున్నట్టు తెలిపారు. `మన శంకర వర ప్రసాద్‌ గారు` సక్సెస్‌ సెలబ్రేషన్‌ నుంచి బయట పడ్డాక కొత్త సినిమాపై అప్‌ డేట్‌ ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. హీరోల డేట్స్ ని బట్టి కొత్త సినిమా ఉంటుందన్నారు.

35
యంగ్‌ హీరోతో అనిల్‌ రావిపూడి నెక్ట్స్ మూవీ

అనిల్‌ రావిపూడికి నెక్ట్స్ హీరో దొరికాడట. ఈ సారి స్టార్‌ హీరో కాకుండా కుర్ర హీరోతో సినిమా చేయబోతున్నాడట. నాగార్జునతో అనిల్‌ నెక్ట్స్ మూవీ ప్లాన్‌ చేస్తున్నట్టుగా ఆ మధ్య ప్రచారం జరిగింది. ఇప్పటి వరకు సీనియర్‌ హీరోల్లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌లతో సినిమాలు చేశారు. ఇక మిగిలింది నాగార్జుననే. ఆయనతో సినిమా చేయబోతున్నట్టు వార్తలొచ్చాయి. కానీ నాగార్జునతో కాదు, అఖిల్‌తో అనిల్‌ సినిమా చేయబోతున్నాడట. అఖిల్‌కి ఇప్పటి వరకు సరైన హిట్‌ లేదు. ఆయన ఎలాంటి సినిమాలకు సెట్‌ అవుతాడనేది క్లారిటీ లేదు. చేసుకుంటూ వెళ్తున్నాడు, వరుసగా ఆయా సినిమాలు డిజప్పాయింట్‌ చేస్తున్నాయి.

45
అఖిల్‌కి కమర్షియల్‌ హిట్‌ కోసం నాగ్‌ తాపత్రయం

ఈ క్రమంలో అఖిల్‌కి ఒక కమర్షియల్‌ హిట్‌ ఇవ్వాలని నాగార్జున తపిస్తున్నాడు. అందులో భాగంగానే అఖిల్‌తో అనిల్‌ రావిపూడి సినిమాని సెట్‌ చేసినట్టు సమాచారం. వరుసగా హిట్లతో జోరు మీదున్న అనిల్‌ రావిపూడితో సినిమా అయితే అఖిల్‌కి హిట్‌ వస్తుందని నాగ్‌ నమ్ముతున్నారట. అందులో భాగంగానే ఈ ప్రాజెక్ట్ సెట్‌ అయినట్టు సమాచారం. అయితే ఇదే నిజమైతే ఇది పెద్ద రిస్క్ ప్రాజెక్టే అంటున్నారు నెటిజన్లు. అఖిల్‌కి అనిల్‌ రావిపూడి జోనర్ సెట్‌ అవుతుందా అనేది సస్పెన్స్ గా మారింది. అఖిల్‌ కామెడీ చేయగలడా అనేది డౌట్‌గా మారింది. దర్శకుడు చేయించుకున్నా, ఆడియెన్స్ ఎలా రిసీవ్‌ చేసుకుంటారనేది పెద్ద డౌట్‌. మొత్తంగా ఈ ప్రాజెక్ట్ నిజమైతే మాత్రం పెద్ద రిస్క్‌ అని అటు విశ్లేషకులు, ఇటు నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.  మరి ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతం అఖిల్‌ `లెనిన్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఇది మేలో రిలీజ్‌ కానుంది. 

55
వెంకీ, రానాలతో అనిల్‌ మూవీ?

ఇదిలా ఉంటే అనిల్‌ రావిపూడి.. వెంకటేష్‌తోనూ ఓ మూవీ అనుకుంటున్నారట. `సంక్రాంతికి వస్తున్నాం` సీక్వెల్‌ ఉండబోదని తెలిపారు. దీంతో వెంకీతో ఓ కొత్త ప్రాజెక్ట్ అనుకుంటున్నారట. ఇందులో రానా నటించే అవకాశం ఉందట. మరి అనిల్‌ నెక్ట్స్ అఖిల్‌తోనా? లేక వెంకీతోనా అనేది చూడాలి. ప్రస్తుతం వెంకటేష్‌.. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో `ఆదర్శకుటుంబం`(ఏకే 47) చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత `దృశ్యం 3` ఉండబోతుందట. అనంతరం అనిల్‌తో సినిమా ఉంటుందని సమాచారం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories