సమంత మిస్ అయిన సినిమాల్లో రీసెంట్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ పుష్ప కూడా ఉంది. సమంత మిస్ అవ్వడం వల్ల ఆ అదృష్టం రష్మికను పట్టుకుంది. విషయం ఏంటంటే.. రంగస్థలం సినిమాలో సమంత యాక్టింగ్ కు ఫిదా అయిపోయిన సుకుమార్.. అల్లు అర్జున్ సరసన పుష్ప సిరీస్ లలో సమంతను తీసుకోవాలి అనుకున్నాడట. కానీ అప్పుడే సమంత విడాకులు తీసుకోవడం.. ఆమె కోలుకోవడానికి చాలా టైమ్ పట్టింది. ఆ టైమల్ ఓ ఎంతో బాధలో ఉండటంతో ఈ ప్రాజెక్ట్ ను చేయలేదట.
Also Read: సినిమాలతో పాటు కోట్లలో వ్యాపారం, అల్లు అర్జున్ ఆస్తి ఎన్ని కోట్లు, ఏం బిజినెస్ లు చేస్తున్నారు?
ఇక అంతకు ముందు పెళ్ళి పనుల వల్ల ఒక హిట్ సినిమాను మిస్ అయ్యిందట సమంత. నేచురల్ స్టార్ నానితో అప్పటికే ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాల్లో నటించింది సమంత. ఆ తర్వాత ముచ్చటగా మూడోసారి కూడా నటించే అవకాశం వచ్చింది. నిన్ను కోరిలో సమంతను తీసుకోవాలని అనుకున్నాట దర్శకుడు. కాని ఈసినిమాటైమ్ లో చైతూతో పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్.. ఆ సినిమాకు నో చెప్పింది స్యామ్. అయితే ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
Also Read: పవన్ కళ్యాణ్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయన్ ? కారణం ఏంటి?
ఇక తమిళం నుంచి భారీ బడ్జెట్ సినిమాను మిస్ అయ్యింది సమంత. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్, విక్రమ్ కాంబోలో తెరకెక్కిన ఐ సినిమాలో సమంతను హీరోయిన్ గా తీసుకోవాలని అడిగారట. సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. కాని కొన్ని కారణాల వల్ల సమంత ఈ సినిమా నుంచి తప్పుకుందట. దాంతో అమీర్ జాక్సన్ ఐ సినిమాలో హీరోయిన్ గా నటించింది. కాని ఈసినిమా అనుకున్నంత హిట్ అవ్వలేదు.
Also Read: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ తనయుడు, మార్క్ శంకర్ కు గాయాలు, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే?
రామ్ చరణ్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఎవడు సినిమాలో కూడా సమంతనే హీరోయిన్ గా చేయాల్సి ఉందట. కాని అనారోగ్య కారణాల వల్ల సమంత ఈ సినిమాను రిజక్ట్ చేసిందంట. రామ్ చరణ్ తో మరో సినిమాను కూడా సమంత మిస్ అయ్యింది. ఆసినిమా ఏదో కాదు బ్రూస్ లీ. ఈ సినిమాలో ముందుగా సమంతను తీసుకున్నా.. ఆమె ఆ టైమ్ లో వేరే సినిమాలు కమిట్ అవ్వడం, అవి కంప్లీట్ చేయడానికి ఈ సినిమాను వదలుకుందని తెలుస్తోంది. దాంతో రకుల్ ఈ అవకాశం అందుకుంది. అయితే ఎవడు, బ్రూస్లీ ఈరెండు సినిమాలు పెద్దగా నడవలేదు.
Also Read:
ఇక సమంత బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు వదులుకోవలసి వచ్చింది. ఇప్పుడు అక్కడ వరుస సినిమాలు, వెబ్ సిరిస్ లు చేస్తోంది కాని.. ఒకప్పుడు బాలీవుడ్ నుంచి వచ్చిన ఆఫర్లను సౌత్ సినిమాల కోసం వదిలేసిందట సామ్. నార్త్ లో సూపర్ హిట్ మూవీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ఈ మూవీ కోసం కూడా ముందుగా సమంతను తీసుకోవాలని చూసినా దీనికి సమంత ఆసక్తి చూపలేదంట. ఇలా సమంత మరికొన్ని సినిమాలు కూడా మిస్ అయ్యిందని సమాచారం.