పుష్ప రెండు సినిమాలతో అల్లు అర్జున్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్ కు ఇమేజ్ భారీగా పెరిగింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో అల్లు అర్జున్ లెక్క మారిపోయింది. ఇక అల్లు అర్జున్ సినిమాలతో పాటు బిజినెస్ లు,బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా భారీగా సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది.
సోషల్ మీడియా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ నికర ఆస్తి విలువ 500 కోట్లకు పైనే ఉంటుందని అంటున్నారు. మూవీస్ తో పాటు ప్రొడక్షన్, హాస్పిటాలిటీ, రకరకాల రంగాల్లో పెట్టుబడుల ద్వారా భారీగా సంపాదిస్తున్నారట బన్నీ. అంతే కాదు పలు సంస్థలకు బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు చేస్తూ సోషల్ మీడియా నుండి కూడా సంపాదిస్తున్నారు స్టార్ హీరో.
Also Read: పవన్ కళ్యాణ్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయన్ ? కారణం ఏంటి?