
ఇటీవల `అఖండ` బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ ట్రోల్స్ కి గురయ్యింది. ఆమెని నెటిజన్లు ఏకి పడేశారు. సమాజానికి ఏం సందేశం ఇస్తున్నావంటూ ఓ రేంట్‌లో సోషల్ మీడియాలో ఆడుకున్నారు. ఇలా చేస్తే మిమ్మల్ని అన్‌ఫాలో చేస్తామని హెచ్చరించారు. దీనికి కారణం ఆమె `బోర్బన్` కంపెనీకి చెందిన జిమ్ భీమ్ అనే విస్కీ మందుని ప్రమోట్ చేస్తూ ఓ ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. దీంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.
మరోవైపు అంతకు ముందు స్టార్ హీరోయిన్ సమంత గట్టిగా బుక్కయ్యింది. ఆమె `బ్లెండర్స్ ప్రైడ్` అనే విస్కీ బ్రాండ్‌ని ప్రమోట్ చేసింది. ఏకంగా ఆమె ఫ్యాషన్ వాక్ చేసింది. ఇందులో ఆమె ధరించిన దుస్తులపై నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. ట్రోలర్స్ దారుణంగా రెచ్చిపోయారు. సమంత ఇంతటి హాట్‌గా కనిపించడం, పైగా ఓ ఆల్కహాల్ బ్రాండ్‌ని ప్రమోట్ చేయడం పట్ల వారు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. డబ్బు కోసం ఇంతగా దిగజారుతావా అంటూ కామెంట్లు చేశారు. నమ్ముకున్న అభిమానులను పెడదారి పట్టిస్తావా? అంటూ ట్రోల్స్ చేశారు. దీనిపై సమంత సైతం ఘాటుగానే స్పందించింది. గట్టి కౌంటర్ ఇచ్చారు.
టాలీవుడ్‌లో అత్యంత సక్సెస్‌ఫుల్ హీరోయిన్ బుట్టబొమ్మ పూజా హెగ్డే సైతం విమర్శలెదుర్కొంది. జానీ వాకర్ `రెడ్ లేబుల్` మందుని ప్రమోట్ చేస్తూ కనిపించింది. అంతేకాదు ఓ అడుగు ముందుకేసి గ్లాస్‌లో కలపడం విశేషం. దీంతో ఆమె అభిమానులు సైతం పూజాని తప్పుపట్టారు. బుట్టబొమ్మ ఇదేం పని అంటూ సెటైర్లు వేశారు. కొన్ని రోజులపాటు ఆమెని ట్రోల్స్ తో ఆడుకున్నారు.
కాజల్ మ్యారేజ్ చేసుకుని లైఫ్‌లో సెటిల్ అయ్యింది. ఇప్పుడు ఆమె బేబీ బంమ్స్(ప్రెగ్నెంట్) తో మాతృత్వపు ముందు క్షణాలను అనుభవిస్తుంది. అయితే కాజల్ సైతం `టీచర్స్` విస్కీ బ్రాండ్‌ని ప్రమోట్ చేసి విమర్శలెదుర్కొంది. అయితే ఆమె దీపావళి పండుగ రోజే తన భర్తతో కలిసి ఈ లిక్కర్ బ్రాండ్‌ని ప్రచారం చేస్తూ ఫోటోనిపంచుకోగా, ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. డబ్బు సంపాదించేందుకు మరో మార్గం లేదా? ఇదెక్కడి దారుణమంటూ రెచ్చిపోయారు ట్రోలర్స్. ఇద్దరు కలిసి పెగ్గు వేస్తున్నారా? మీరెక్కడ దొరిక్కారా బాబూ అంటూ సెటైర్లు వేశారు. ఆమె ఫోటోని ట్రోల్స్ చేశారు.
టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిన గోవా బ్యూటీ ఇలియానా సైతం లిక్కర్‌ని ప్రమోట్ చేస్తూ దొరికిపోయింది. ఆమె కూడా ఈ మధ్య హాట్ లుక్‌లో ఆల్కహాల్ బ్రాండ్‌ని ప్రమోట్ చేసింది. జపాన్‌కి చెందిన బ్రాండ్ `టోకి`ని ప్రచారం చేసింది. షేమ్‌లెస్ అంటూ విమర్శలెదుర్కొంది. సినిమాలు లేనంత మాత్రాన ఇంతగా దిగజారుతారా? అంటూ నెటిజన్లు ఆమెపై విమర్శలు చేశారు. ట్రోల్స్ చేశారు. అంతకు ముందు బాడీ షేమింగ్ విషయంలో ట్రోల్స్ కి గురైంది ఇలియానా. ఆమెతోపాటు హన్సిక, లక్ష్మీ రాయ్‌లు సైతం ఇదే బ్రాండ్‌ని ప్రమోట్ చేసి ట్రోలర్స్ బారిన పడ్డారు.
`ఆర్‌ఎక్స్ 100` బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ `రాయల్ ఛాలెంజ్` విస్కీ యాడ్ ప్రమోట్ చేసింది. మందుతాగాలని, ఇది చాలా స్మూత్‌గా ఉంటుందని, పండగలు సెలబ్రేట్ చేసుకోవాలని తెలిపింది. దీంతో చిర్రెత్తిపోయిన నెటిజన్లు ఆమెని దారుణంగా ట్రోల్స్ చేశారు. డబ్బుల్ కోసం చివరికి ఇలా చేస్తున్నారా? అంటూ విమర్శలు గుప్పించారు.
రెజీనా `సిగ్నేచర్` మందుని ప్రచారం చేసింది. అంతేకాదు గ్లాస్‌లో ఒక స్ట్రిప్ తీసుకుంటున్న ఫోటోని షేర్ చేసింది. దీంతో రెజీనా మందు కొడుతుందా? ఇదంత మనీ మాయ. ఊహించలేకపోతున్నామంటూ ఫ్యాన్స్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. మీమ్స్ తో ఆడుకున్నారు. విమర్శలు చేశారు.
బాలీవుడ్‌లో బోల్డ్ బ్యూటీగా పేరుతెచ్చుకున్న రాధికా ఆప్టే `జానీ వాకర్` రెడ్ లేబుల్, మరోవైపు కాపర్ డాగ్ మందులను ప్రచారం చేసింది. విమర్శలెదుర్కొంది. దారుణంగా ట్రోల్స్ కి గురయ్యింది. అయినా లెక్క చేయకుండా తాను అనుకున్న పని చేసుకుంటూ వెళ్తుంది. రాధికా తెలుగులో `లయన్`, `లెజెండ్` చిత్రాలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు బాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్‌హీరోయిన్లు కూడా ఇలాంటి ఆల్కహాల్ ప్రమోషన్ చేశారు. కాకపోతే అక్కడ అది కామన్ అనే ఫీలింగ్ ఆడియెన్స్ లో ఉండిపోయింది.
అయితే హీరోయిన్లు ఇలాంటి ఆల్కహాల్ బ్రాండ్ ప్రమోట్ చేయడం పట్ల ఓ వైపు విమర్శలు వస్తుంటే, మరోవైపు మద్దతు కూడా ఉంది. ఆల్కహాల్ అంటే హీరోలే ప్రమోట్ చేస్తారా? హీరోయిన్లు ఎందుకు చేయకూడదని ప్రశ్నించేవాళ్లు ఉన్నారు. ఓ మహిళగా వారి మహిళా సాధికారతకు, లైఫ్‌లో అదొ నెక్ట్స్ లెవల్ అచీవ్‌మెంట్ అని సపోర్ట్ చేసేవాళ్లున్నారు. వీరు ప్రమోట్ చేయకపోతే, ఆల్కహాల్ తాగడం జనాలు మానేస్తారా? అంటూప్రశ్నించే వాళ్లు ఉన్నారు. ఏదేమైనా రెండు రకాలు కామెంట్లు వినిపిస్తుంటాయి. ఇవన్నీ పట్టించుకోకుండా హీరోయిన్లు తమ పని తాము చేసుకుంటూ వెళ్లడం విశేషం.