Sudigali Sudheer: ఊరించి ఉసూరుమనిపించిన సుడిగాలి సుధీర్ .... పెళ్లి వద్దంటూ సంచలన ప్రకటన 

Published : Apr 12, 2022, 02:46 PM ISTUpdated : Apr 12, 2022, 02:48 PM IST

సెన్సేషన్ కోసం సిల్లీ ప్రోమోలు ఎక్కువైపోయాయి. ఈ పాత ఆవకాయ ట్రిక్స్ వెగటుపుడుతున్నాయ్ బాబోయ్... అని ప్రేక్షకులు మొత్తుకుంటున్నా ఆపడం లేదు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో సంచలనంగా రేపగా తీరా ఎపిసోడ్ చూసి ఆడియన్స్ తిట్టుకుంటున్నారు. 

PREV
16
Sudigali Sudheer: ఊరించి ఉసూరుమనిపించిన సుడిగాలి సుధీర్ .... పెళ్లి వద్దంటూ సంచలన ప్రకటన 

సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)యాంకర్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ పేరుతో షో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ కి మించి ఈ ప్రోగ్రాం ప్లాన్ చేశారు. బుల్లితెర కమెడియన్స్ తోపాటు  సీనియర్ సినిమా నటులు, నటీమణులు కనువిందు చేస్తున్నారు. కామెడీ, డాన్స్ తో పాటు స్పెషల్ ఈవెంట్స్ తో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. 
 

26

గత ఆదివారం ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ (Sridevi drama company) ఎపిసోడ్ కి బుల్లెట్ భాస్కర్ ఫాదర్ తో పాటు మరికొందరు కమెడియన్స్ తండ్రులు హాజరయ్యారు. ఈ క్రమంలో బుల్లెట్ భాస్కర్ తండ్రి సుధీర్ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. సుధీర్ ఫాదర్... ఫోన్ చేసి వాళ్ళ అబ్బాయి పెళ్లి గురించి అడుగుతున్నారు. వాడు ఎవరినైనా ప్రేమించాడా? ప్రేమిస్తే ఆ అమ్మాయి ఇండస్ట్రీ అమ్మాయా? లేక బయట అమ్మాయా? అని తెలుసుకోవాలని నాతో చెప్పారని, ఆయన అన్నారు.

36

బుల్లెట్ భాస్కర్ ఫాదర్ కామెంట్స్ తర్వాత ఎపిసోడ్ లో పాల్గొన్న వారందరూ సుధీర్ కి కాబోయే భార్య ఎవరో తెలియజేయాలంటూ పట్టుబట్టారు. దీంతో సుధీర్ అందరూ అడుగుతున్నారు కాబట్టి, తప్పదు అంటూ స్టేజ్ పై నుండి క్రిందికి వెళ్ళాడు. అంత వరకు శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో కట్ చేశారు. దీంతో సుధీర్ ఫైనల్ గా తన ప్రేయసిని పరిచయం చేయబోతున్నారని, ఆ అమ్మాయి ఎవరో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుస్తుందని అందరూ ఫిక్స్ అయ్యారు.

46


ఈ క్రమంలో ఆదివారం ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ పూర్తిగా చూశారు.తీరా ఎప్పటిలాగే ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఆత్రుతపై సుధీర్ నీళ్లు చల్లారు. అమ్మాయిని పరిచయం చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చి, చివరికి తనకు పెళ్లి కంటే ఫ్యాన్స్ ముఖ్యం, కాబట్టి పెళ్లి చేసుకోను అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. 

56


సుధీర్ చర్య ఆడియన్స్ కి కోపం తెప్పించింది. ఆయనను సోషల్ మీడియాలో తిడుతున్నారు. అదే సమయంలో ఇకపై ఇలాంటి సిల్లీ ప్రోమోలు కట్ చేయవద్దని వార్నింగ్ ఇస్తున్నారు. పదుల సంఖ్యలో ఇదే తరహా ప్రోమోలు చూసిన బుల్లితెర ఆడియన్స్ సైతం విసిగిపోయారు. అందుకే చాలా మంది ప్రేక్షకులు ఇలాంటి ప్రోమోలను నమ్మడం మానేశారు. 
 

66


ఆ మధ్య జబర్దస్త్ నుండి తప్పుకుంటున్నట్లు సుధీర్ టీం సభ్యులు హైడ్రామా చేశారు. సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ స్టేజి పై కన్నీళ్లు పెట్టుకోవడంతో పాటు జబర్దస్త్ మానేస్తున్నట్లు ప్రకటన చేశారు. తీరా చూస్తే అది కూడా సెన్సేషన్ కోసం వాళ్ళు చేసిన ట్రిక్ అని తేలింది.  

click me!

Recommended Stories